Asianet News TeluguAsianet News Telugu

వివాహేతర సంబంధం పెట్టుకున్నారని.. భర్త, ప్రియురాలికి అరగుండు కొట్టించి ఊరేగించిన భార్య..

భర్త తన ప్రియురాలితో కలిసి ఉన్నప్పుడు భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. తన కుటుంబ సభ్యుల సహకారంతో వారిద్దరికీ అరగుండు కొట్టించింది. చేతులు కట్టేసి గ్రామంలో అలాగే వారిని ఊరేగించింది. ఈ ఘటన ఏపీలోని శ్రీసత్య సాయి జిల్లాలో జరిగింది.

The wife who shot her husband and girlfriend for having an extra-marital affair and paraded her....Incident in Sri Sathya Sai district..ISR
Author
First Published Sep 5, 2023, 8:45 AM IST

భర్త ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆ భార్యకు తెలిసింది. తీరు మార్చుకోవాలని పలుమార్లు సూచించింది. అయినా అతడి ప్రవర్తన అలాగే కొనసాగింది. ఈ క్రమంలో భర్త తన ప్రియురాలితో సన్నిహితంగా ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. వారిద్దరికీ అరగుండు కొట్టించి ఊరేగించింది. దీనికి ఆమె కుటుంబ సభ్యులు కూడా సహకరించారు.

వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీసత్యసాయి జిల్లాలో హుస్సేన్ కు కొంత కాలం కిందట వివాహం అయ్యింది. అయితే అతడు మరో యువతితో సన్నిహితంగా ఉంటున్నాడు. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం భార్యకు తెలిసింది. వివాహేతర సంబంధం కొనసాగించకూడదని ఆమె భర్తకు పలుమార్లు చెప్పింది. అయినా వినకుండా అతడు తన ప్రియురాలితో సన్నిహితంగా మెలుగుతున్నాడు. 

ఈ క్రమంలో హుస్సేన్ లేపాక్షి గ్రామంలో తన ప్రియురాలితో ఉండగా నజియా, తన కుటుంబ సభ్యులతో కలిసి రెడ్ హ్యాండెండ్ గా పట్టుకుంది. అనంతరం భర్తతో పాటు ఆ యువతికి కూడా అరగుండు కొట్టించారు. గ్రామంలో ఊరేగించారు. దీనిని ఆమె కుటుంబ సభ్యులు వీడియో పలు సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ లలో పోస్ట్ చేశారు. దీంతో అవి వైరల్ అయ్యాయి. అయితే ఊరేగింపు అనంతరం వారిని కట్టేసి ఆటోలో పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో హుస్నేన్ తప్పించుకొని పారిపోయాడు.  

ఈ ఘటనపై  హిందూపురం సబ్ డివిజనల్ పోలీసు అధికారి పి.కంజాక్షన్ మీడియాతో మాట్లాడుతూ.. హుస్సేన్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అతడి భార్య వారిద్దరినీ పట్టుకొని, ఊరేగించిందని తెలిపారు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ చర్యకు పాల్పడిన నిందితురాలు, ఆమె కుటుంబ సభ్యులపై 506 (క్రిమినల్ బెదిరింపు), 355 (ఒక వ్యక్తిని అవమానించడానికి దాడి చేయడం లేదా బలప్రయోగం), 323 (స్వచ్ఛందంగా గాయపరచడం) వివిధ భారతీయ శిక్షా స్మృతి సెక్షన్ల కింద పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసే పనిలో ఉన్నారని ‘ఇండియా టుడే’ నివేదించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios