మచిలీపట్నంలో గత నెలలో జరిగిన డాక్టర్ రాధ హత్య కేసును పోలీసులు ఛేదించారు. టెక్నాలజీని ఉపయోగించుకొని డాక్టర్ భర్త, ఆ ఇంటి కారు డ్రైవర్ ఈ దారుణానికి ఒడిగట్టారని నిర్ధారణకు వచ్చారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకొని, రిమాండ్ కు తరలించారు.
ఏపీలోని మచిలీపట్నంలో ఇటీవల సంచలనం రేకెత్తించిన డాక్టర్ రాధ హత్య కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఆమె జూలై 25వ తేదీన హత్యకు గురవగా.. నిందితులైన ఆమె భర్త, అలాగే వారి కారు డ్రైవర్ ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. శనివారం వారికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు వారిని డిస్ట్రిక్ట్ జైలుకు తీసుకెళ్లారు.
వివాహమైన మాజీ ప్రియుడి కిడ్నాప్.. బలవంతంగా అతడిని మళ్లీ పెళ్లి చేసుకున్న మాజీ ప్రియురాలు..
‘ఈనాడు’ కథనం ప్రకారం.. డాక్టర్ రాధ భర్త మహేశ్వరరావు, డ్రైవర్ మధులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో వారు చెప్పిన విషయాలు విని పోలీసులు నిర్ఘాంతపోయారు. తాము ఈ హత్య చాలా పకడ్బంధీగా ప్లాన్ చేశామని, ఎవరికీ దొరకమని భావించామని, అయినా ఎలా చేధించారని పోలీసు అధికారులను నిందితుడైన రాధ భర్త అడిగారు. ఆయన చెప్పినట్టుగా ఈ హత్య పక్కా ప్లాన్ తో జరిగింది.
డాక్టర్ రాధ, మహేశ్వరరావు దంపతులు బిల్డింగ్ లోని సెకెండ్ ఫ్లోర్ లో నివసిస్తారు. కింద హాస్పిటల్ నిర్వహణ కోసం ఉపయోగించుకునేవారు. అయితే హత్య జరిగిన రోజుల జోరుగా వర్షం కురుస్తోంది. రాధ హత్యకు గురైన తరువాత ఆమె ఒంటిపై ఉన్న నగలు మాత్రమే యామమయ్యాయి. కానీ ఇంట్లో ఉన్న 8 కిలోల బంగారం, 50 లక్షల రూపాయిలు అలాగే ఉన్నాయి. ఇదే పోలీసులకు అనుమానం కలిగేలా చేసింది. దొంగలు అంత భారీ వర్షంలో ఇంట్లోకి ప్రవేశించి, ఇంట్లో పెద్ద ఎత్తున ఉన్న బంగారం, నగదు ఎత్తుకెళ్లకుండా, కేవలం డాక్టర్ శరీరంపై ఉన్న నగలు మాత్రమే ఎత్తుకెళ్లరని పోలీసు అధికారులు నిర్దారణకు వచ్చారు. ఇది బయటి వ్యక్తులు చేసిన పని కాదని వారికి అప్పుడే అనుమానం వచ్చింది.
పాఠశాలపై పిడుగు.. 16 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు.. పలువురి పరిస్థితి విషమం..
దీంతో సాంకేతికతను ఉపయోగించుకొని పోలీసులు ఈ కేసును దీనిని చేధించారు. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్న సెల్ టవర్ల డంప్ విశ్లేషణ చేపట్టారు. అందులో 12 నెంబర్లపై పోలీసులకు అనుమానం కలిగింది. అందులో ఓ నెంబర్ డాక్టర్ మహేశ్వరరావుదిగా తేల్చారు. ఆ నెంబర్ నుంచి డ్రైవర్ మధుకు చాలా సార్లు కాల్స్ వెళ్లాయి. దీని ఆధారంగా వారిద్దరిపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు.
భార్యను హతమార్చాలని డాక్టర్ మహేశ్వరరావు మూడు నెలల ముందు నుంచే అనుకున్నట్టు తెలుస్తోంది. అందుకే హాస్పిటల్ లో సీసీ కెమెరాలు చెడిపోయినా వాటిని రిపేర్ చేయించలేదు. ఇక అప్పటి నుంచి హత్య కోసం ఓ మంచి సమయం కోసం ఆయన ఎదురు చూశారు. అయితే జూలై 26వ తేదీన కోడలు ప్రసవం కోసం రాధ పల్నాడు జిల్లాకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంది. కానీ భార్య అక్కడికి వెళ్తే రావటానికి చాలా సమయం పడుతుందని భర్త ఆలోచించాడు. అందుకే జూలై 25వ తేదీనే తన ప్లాన్ ను అమలు చేయాలని నిర్ణయించుకున్నాడు.
కెనడాలో మరో హిందూ దేవాలయం ధ్వంసం.. ప్రధాన ద్వారంపై ఖలిస్తాన్ రెఫడెండం పోస్టర్లు..
అదే రోజు మహేశ్వరరావు, మధులు కలిసి సాయంత్రం 5.45 గంటలకు ఇంట్లోకి వెళ్లారు. ఈ దృశ్యాలు హాస్పిటల్ పక్కన ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. రాధ హత్య జరిగిన తరువాత భర్త లిఫ్ట్ ద్వారా, మధు మెట్ల ద్వారా కిందికి వచ్చారు. ఇవి కూడా ఆ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అయితే ఈ హాస్పిటల్ దాదాపు కిలో మీటర్ దూరంలో ఉన్న ఓ సీసీ కెమెరాల్లో మధు కనిపించాడు. అంతవానలోనూ డాక్టర్ హడావిడిగా సూపర్ మార్కెట్ కు ఓ స్కూటీపై వెళ్లాడు. అక్కడ కారం పొడి ప్యాకెట్ కొన్నాడు. అనంతరం ఇంటికి వెళ్లాడు.
సీసీ ఫుటేజీల ఆధారంగా డ్రైవర్ మధును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుధీర్ఘంగా అతడిపై విచారణ జరిపారు. ఆ ఇంటికి ఎంతో నమ్మకంగా ఉన్న ఆ డ్రైవర్ తేలికగా నిజాలు వెల్లడించలేదు. పోలీసులు ఈ ఆధారాలు అన్నీ చూపించిన తరువాతే చేసిన దారుణాన్ని వివరించారు. తాను, డాక్టర్ భర్త కలిసి డాక్టర్ రాధను హతమార్చామని చెప్పాడు. తరువాత డాక్టర్ మహేశ్వరరావుపై పోలీసులు విచారణ చేపట్టారు. తొలుత ఆయన కూడా జరిగిన విషయాన్ని వెల్లడించలేదు. తరువాత తాను పక్కా పథకం ప్రకారమే ఈ దారుణానికి పాల్పడ్డాని చెప్పారు. ఈ విషయాలను ఎలా ఛేదించారని పోలీసులను అడిగాడు.
క్రైమ్ వెబ్ సిరీస్‌లు, యూట్యూబ్ చూసి దారుణం.. మీరట్ హత్య కేసులో విస్తుగొలిపే నిజాలు
రాధ హత్యలో తన ప్రమేయం లేదని నిరూపించేందుకు డాక్టర్ అన్ని ప్రయత్నాలను చేశారు. ఆ సమయంలో తాను వేరే పనిలో నిమగ్నమై ఉన్నానని నిరూపిచేందుకు గూగుల్ లో పలు అంశాలను శోధించారు. కానీ పోలీసులు టెక్నాలజీని ఉపయోగించి, దర్యాప్తులో ఇవన్నీ కనిబెట్టేశారు. కాగా.. పోలీసులు ఆయనను మరింతగా విచారించేందుకు కస్టడీ పిటిషన్ వేయాలనే ఆలోచనలో ఉన్నారు.
