రిమాండ్ కు తీసుకొచ్చిన నిందితులను గాయపర్చిన పోలీసులపై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుల రిమాండ్ ను రద్దు చేయడంతో పాటు పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. 

రిమాండ్‌కు తీసుకొచ్చిన నిందితుల‌ను తీవ్రంగా కొట్టిన పోలీసుల‌పై జ‌డ్జి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కార‌కులైన పోలీసుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఓ కేసులో గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు 8 మంది వ్య‌క్తుల‌ను పోలీసులు అదుపులో తీసుకున్నారు. నిందితుల‌ను రాత్రి స‌మ‌యంలో మంగ‌ళ‌గిరి జ‌డ్జి ఎదుట పోలీసులు హాజ‌రుప‌రిచారు. దీంతో వారు జ‌డ్జి ఎదుట క‌న్నీటిప‌ర్యంత‌మ‌య్యారు. త‌మ‌ను పోలీసులు చిత్రహింస‌లు పెట్టార‌ని జ‌డ్జి ఎదుట వాపోయారు. దీంతో వారిని ప‌రీక్ష‌ల కోసం స్థానిక హాస్పిట‌ల్‌కు పంపించాల‌ని జ‌డ్జి ఆదేశించారు. ప‌రీక్ష‌ల్లో నిందితుల శ‌రీరంపై గాయాలు ఉన్న‌ట్టు వైద్యులు ధృవీక‌రించారు. ఆ నివేదిక‌ను జ‌డ్జికి అందించారు. దీనిని చూసి జ‌డ్జి పోలీసుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నిందితుల‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని ఆదేశించారు. అలాగే గాయ‌ప‌ర్చిన పోలీసుల‌పై శాఖాప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు. 

ఇన్ స్టా లో యువతిగా పరిచయం.. నగ్న చిత్రాలను పంపమంటూ..అమ్మాయిలకు బెదిరింపులు.. యువకుడి అరెస్ట్..