YS Jagan : పిల్లలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి చదువే.. - ఏపీ సీఎం వైఎస్ జగన్
YS Jagan : ఏపీ ప్రభుత్వం ప్రపంచ స్థాయి విద్యకు పెద్దపీట వేస్తోందని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అందుకే పాఠశాలల్లోకి ఇంగ్లీష్ మీడియం బోధనను తీసుకువచ్చిందని తెలిపారు.

YS Jagan : చదువే పిల్లలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి అని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రపంచ స్థాయి విద్యకు పెద్ద పెట్ట వేస్తూ, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ను తీసుకువచ్చి ఏపీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఏపీకి చెందిన పిల్లలు జాతీయ స్థాయిలో రాణించేలా ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలకు ప్రధాన్యత పెంచామని అన్నారు.
దళితులకు బీజేపీలో ఎదుగుదల ఉండదు - సొంత పార్టీపై కర్ణాటక ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
దీంతో పాటు అంగన్‌వాడీల నుంచి కాలేజీల వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకువచ్చిందని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. భారత తొలి ప్రధాని దేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని బాలబాలికలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు అని ఆయన తెలిపారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం వైఎస్ జగన్ ‘ఎక్స్’ లో పోస్టు పెట్టారు.