అంగన్ వాడీలపై ప్రభుత్వం సీరియస్.. విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు.. మండిపడ్డ టీడీపీ..
నిరసనలు తెలుపుతూ ఇంకా విధుల్లో చేరని అంగన్ వాడీల (anganwadi workers protest in andhra pradesh)ను తొలగించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమయ్యింది. ఎస్మా చట్టం కింద నోటీసులు జారీ చేసినా విధుల్లో చేరని వారిని తొలగించాలని సూచిస్తూ ఏపీ సీఎస్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ (AP Government issued orders dismissing Angan Wadis from their duties) చేశారు.
గత కొంత కాలంగా నిరసన చేపడుతున్న అంగన్ వాడీలపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఇప్పటి వరకు విధుల్లో చేరని సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు సిద్ధమయ్యింది. ఎస్మా చట్టం కింద షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ విధుల్లో చేరని సిబ్బందిని తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అయితే దీనిపై ప్రతిపక్ష టీడీపీ మండి పడింది.
అంగన్ వాడీల కన్నీటిలో జగన్ కొట్టుకుపోతాడు - అచ్చెన్నాయుడు
అంగన్ వాడీ సిబ్బందిపై పోలీసులు ప్రవర్తించిన తీరు, ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు తాను వదిలిన బాణం తిరిగి తనవైపే దూసుకు రావడం, మరోవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మతిభ్రమించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి విచక్షణ కోల్పోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనకు అంతిమ ఘడియలు సమీపిస్తున్న వేళ ఫ్రస్టేషన్ తో ఆయన పిచ్చి పీక్ స్టేజికి చేరిందని ఆరోపించారు.
అంగన్ వాడీలతో చర్చలు జరపకుండా ఈడ్చేస్తారా ? ఇది అప్రజాస్వామికం - పవన్ కల్యాణ్
పిచ్చివాడి చేతిలో రాయి అటు, ఇటు తిరిగి తమ న్యాయమైన డిమాండ్ల కోసం 42రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్ వాడీల వైపు మళ్లిందని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. అంగన్వాడీలను ఉద్యోగాల నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం నియంతృత్వ పోకడలకు అద్దంపడుతోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాటాకు చప్పుళ్లకు లొంగని అంగన్వాడీలు ఛలో విజయవాడకు పిలుపునివ్వడంతో తాడేపల్లి ప్యాలెస్ లో ప్రకంపనలు చెలరేగుతున్నాయని అన్నారు.
500 ఏళ్ల నిరీక్షణకు తెర.. అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట పూర్తి.. భావోద్వేగానికి గురైన భక్తులు
ప్రభుత్వం అంగన్వాడీల విషయంలో తప్పు చేయకపోతే సీఎం నివాసానికి వెళ్లే మార్గంలో టన్నుల కొద్దీ ఐరన్ ఫెన్సింగులు, వందలాది అదనపు బలగాలను దించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని నారా లోకేష్ ప్రశ్నించారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఎలాంటి బెదిరింపులకూ లొంగకుండా అంగన్వాడీలు ఉక్కు సంకల్పంతో చేస్తున్న ఆందోళనకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా సంఘీభావం తెలియజేస్తోందని ఆయన స్పష్టం చేశారు.
ప్రాణ ప్రతిష్ఠతో రామ రాజ్యం ప్రారంభం - శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన అర్చకుడు సత్యేంద్ర దాస్
ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అంగన్వాడీల ఆగ్రహజ్వాలలే అరాచక ప్రభుత్వానికి చితిమంటలు కాబోతున్నాయని నారా లోకేష్ అన్నారు. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం మూర్ఖపు చర్యలను విడనాడాలని సూచించారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తొలగించే అంగన్వాడీలను, టీడీపీ - జనసేన ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎలాంటి సర్వీసు అంతరాయం ఉద్యోగాల్లోకి తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.