Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో ఉన్నది చేత‌గాని ప్ర‌భుత్వం - నారాలోకేష్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి గురువారం మంగళగిరిలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఆరోపణలు చేశారు. 

The AP is ruled by an unconscious government
Author
Amaravati, First Published Dec 9, 2021, 7:16 PM IST

ఏపీలో ఉన్నది చేత‌గాని ప్ర‌భుత్వమ‌ని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ అన్నారు. వైసీపీ ప్ర‌జ‌ల‌తో మ‌మేకం కాలేక‌పోతోంద‌ని ఆరోపించారు. గురువారం ఆయ‌న మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృత ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా వైసీపీ ప్ర‌భుత్వంపై ఫైర్ అయ్యారు. ఏపీ ప్రభుత్వం చెబుతున్న ఓటీసీ ప్ర‌జ‌లు క‌డితే త‌రువాత అంద‌రి పెన్ష‌న్‌, రేష‌న్ క‌ట్ చేస్తార‌ని ఆరోపించారు. ఓటీఎస్ స్వ‌చ్ఛందం అని చెబుతున్న ప్ర‌భుత్వం అధికారుల‌కు టార్గెట్ ఎందుకు కేటాయించిందో చెప్పాల‌ని ప్ర‌శ్నించారు. 

శోకసంద్రంలో సాయితేజ కుటుంబం.. స్వగ్రామంలోనే అంత్యక్రియలకు ఏర్పాట్లు.. చివరి మాటలు ఇవే..

గెస్ట్ గా మారిన ఎమ్మెల్యే..
మంగ‌ళగిరి ఎమ్మెల్యే ఆర్కే నియోజ‌క‌వ‌ర్గానికి చుట్టంగా మారార‌ని లోకేష్ ఎద్దేవా చేశారు. రెండు సార్లు విజ‌యం సాధించిన ఆర్కే గెస్ట్ లెక్చరర్ గా అప్పుడ‌ప్పుడు వ‌స్తూ పోతూ ఉన్నార‌ని ఆరోపించారు.మాయ‌మాట‌లు చెప్పి ప్ర‌జ‌లను మోసం చేస్తున్నార‌ని అన్నారు. మంగ‌ళ‌గిరిలో అభివృద్ధి శూన్య‌మ‌ని అన్నారు. కానీ పేదల ఇళ్ల‌ను కూల్చ‌డంలో మాత్రం అభివృద్ధి క‌నిపిస్తోంద‌ని ఆరోపించారు. దొంగల భయంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నార‌ని, వైసీపీ హ‌యాంలో ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని అన్నారు. కరెంట్ బిల్లు ఎక్కువగా వ‌చ్చింద‌ని, రైతుల పేరుపై భూమి ఉంద‌ని పెన్ష‌న్లు తీసేయ‌డం స‌రైంది కాద‌ని అన్నారు. తాను మంగ‌ళ‌గిరిలో గెలిస్తే ఇళ్లు కూల‌గొడ‌తాన‌ని ప్ర‌చారం చేసిన ఆర్కే.. ఇప్పుడు అదే ప‌ని చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఇప్పుడు ఆయ‌న నిజ‌స్వ‌రూపం భ‌య‌ట‌ప‌డింద‌ని చెప్పారు. ఆర్కే ప్ర‌తీ ప‌నిలో అవినితీకి పాల్ప‌డుతున్నార‌ని ప్ర‌శ్నించారు. సీఎం నివాస‌రం ఉంటున్న నియోజకవర్గంలో ఇసుక రీచులున్నా, అందులో ఇసుక అంద‌బాటులో లేదంటే ఏమ‌నుకోవాలో అర్థం కావ‌డం లేద‌ని అన్నారు. ఇక్క‌డున్న ఇసుక ఎక్క‌డికి పోతుంద‌ని ప్ర‌శ్నించారు. ఇసుక అమ్మి క‌మీష‌న్లు మంత్రి, ఎమ్మెల్యే పంచుకుంటున్నారా అని ప్ర‌శ్నించారు. ఓటీఎస్ అనేది అతిపెద్ద స్కాం అని ఆరోపించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios