కొంతమంది సోషల్‌ మీడియాలో తన పేరుతో నకిలీ ఆడియోను వైరల్‌ చేశారని, దాన్ని నమ్మవద్దని సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ చెప్పారు. ప్రస్తుత కొవిడ్‌ పరిస్థితులపై తాను మాట్లాడినట్లు వైరల్‌ అవుతున్న ఆడియో టేపులు నకిలీవని తెలిపారు. 

"

ప్రపంచ ఆరోగ్య సంస్థలో పనిచేస్తున్న తన స్నేహితుడు ఇచ్చిన సమాచారాన్ని చెబుతున్నానంటూ తన పేరుతో కొందరు నకిలీ ఆడియో సృష్టించి సోషల్‌ మీడియాలో పోస్టు చేసినట్లు తెలిసిందన్నారు. 

దీనిపై గతంలో సీఐడీ విభాగంలో ఫిర్యాదు చేశానన్నారు. తన పేరుతో వైరల్‌ అవుతున్న నకిలీ వార్తలను నమ్మవద్దని, అదే విధంగా షేర్‌ చేయవద్దని ఆయన కోరారు.