అలిగిన టీజీ వెంకటేశ్.. సీఎం సమావేశానికి గైర్హాజరు.. త్వరలో

tg venkatesh not attended cm chandrababu meeting
Highlights

లోకేష్ అధికారికంగా ప్రకటించినప్పటికీ.. ఇంకా తన కుమారుడు టీజీ భరత్ కి ఎమ్మెల్యే సీటు దక్కేలా టీజీ  ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. 

కర్నూలు జిల్లా నాయకులతో ఏపీ సీఎం చంద్రబాబు ఏర్పాటు చేసిన సమావేశానికి టీజీ వెంకటేష్ గైర్హజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో  కర్నూలు ఎమ్మెల్యే సీటు ఆయన కుమారుడే దక్కుతుందని ఆయన భావించారు. కానీ.. లోకేష్ ఆ ఎన్నికల సీను మొత్తం మార్చేశారు.

ఇటీవల కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను లోకేష్ ఖరారు చేశారు. ఎంపీగా బుట్టా రేణుక, ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్ రెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు టీజీని బాగా బాధించాయి. లోకేష్ ని ఎస్వీ హిప్నటైజ్ చేశాడంటూ తన ఆవేదన వెల్లగక్కాడు.

లోకేష్ అధికారికంగా ప్రకటించినప్పటికీ.. ఇంకా తన కుమారుడు టీజీ భరత్ కి ఎమ్మెల్యే సీటు దక్కేలా టీజీ ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో.. పార్టీ బలేపేతం కోసం గురువారం సీఎం నిర్వహించిన సమావేశానికి గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. 

టీజీ అలిగితే.. అధిష్టానం దిగి వస్తుందని భావిస్తున్నట్లు సమాచారం. కాగా..త్వరలోనే చంద్రబాబును కలిసి టిక్కెట్‌ విషయంపై చర్చించాలని టీజీ భావిస్తున్నట్లు సమాచారం. టీజీ గైర్హాజరు కావడంతో సీఎం పేసీ నుంచి పలువురు నాయకులు, అధికారులు టీజీకి ఫోన్‌ చేసినట్లు తెలిసింది. సమావేశానికి రాకపోవడంపై కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నించిన్నట్లు సమాచారం. అయితే టీజీ వారితో ఏం మాట్లాడాడో తెలియరాలేదు.

loader