ఎన్టీఆర్ జిల్లా  తిరువూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ నేతల పరస్పర సవాళ్లతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. 

ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ నేతల పరస్పర సవాళ్లతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తిరువూరు అభివృద్ది ఎవరి హయాంలో జరిగిందనే దానిపై ఇరు పార్టీలకు చెందిన నేతలు సవాళ్లు విసురుకున్నారు. ఈ క్రమంలోనే ఇరు పార్టీల నేతలు బోసుబొమ్మ సెంటర్‌లో చర్చకు సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే అప్రమత్తమైన పోలీసులు.. ఇరు పార్టీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే బోసుబొమ్మ సెంటర్ వద్దకు చేరుకున్న టీడీపీ నేత కొమ్ము బాబూరావును పోలీసులు అరెస్ట్ చేశారు. 

అయితే ఆదివారం రాత్రి కూడా పలువురు టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తమ పార్టీకి చెందిన కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకన్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పోలీసుల తీరుపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అదుపులోకి తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. మరోవైపు తిరువూరులో భారీగా పోలీసులు మోహరించారు.