విజయవాడ ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించిన టీడీపీ: పోలీసులతో వాగ్వాదం, ఉద్రిక్తత

విజయవాడ ఎక్సైజ్ కార్యాలయం ముట్టడించేందుకు టీడీపీ నేతలు ఇవాళ ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు.
 

Tension prevails at Vijayawada Excise office after Tdp workers protest

విజయవాడ: Vijayawada ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బుధవారం నాడు టీడీపీ ప్రయత్నించింది. దీంతో ఉద్రిక్తత నెలకొంది. జంగారెడ్డి గూడెంలో మరణాలపై TDP ఇవాళ  Excise కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చింది.  దీంతో టీడీపీ నేతలను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్  చేశారు. టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు Atchannaidu సహా పలువురు కీలక నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

టీడీపీ నేతలు, కార్యకర్తలు బుధవారం నాడు విజయవాడలో ర్యాలీ నిర్వహించారు. ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం వరకు టీడీపీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు ర్యాలీగా వెళ్లారు అయితే ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలోనికి టీడీపీ నేతలను అనుమతి ఇవ్వలేదు. దీంతో పోలీసులకు టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. ;టీడీపీ నేతలకు అనుమతి లేదని పోలీసులు పేర్కొన్నారు.శాంతియుతంగా నిరసనకు పూనుకున్న తమను అరెస్ట్ చేయడం సరైంది కాదని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

జంగారెడ్డిగూడెం మరణాలను సహజ మరణాలని అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఎస్‌ఈబీ అధికారులే జంగారెడ్డిగూడెంలో పలు కేసులు నమోదు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.జంగారెడ్డిగూడెం మరణాలపై  ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇస్తుందని  టీడీపీ మండిపడుతుంది.

ఎక్సైజ్ కార్యాలయం వద్ద నిరసనకు దిగిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, చినరాజప్ప, ఆదిరెడ్డి భవానీ, బెందాళం ఆశోక్, తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు.

జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చకు ఇవాళ కూడా ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. చిడతలు పట్టుకొని నిరసనకు దిగారు. ఈ సమయంలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులను సభ నుండి సస్పెండ్ చేయాలని పలువురు వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కల్గించడంపై స్పీకర్ టీడీపీ సభ్యుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఏపీ అసెంబ్లీలో ఇవాళ టీడీపీ సభ్యులు  చిడతలు వాయించిన అంశాన్ని ఎథిక్స్ కమిటీ ముందుకు తీసుకు వెళ్లనున్నారు. నిన్న ఏపీ అసెంబ్లీలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు విజిల్ వేశారు. ఈ రెండు ఘటనలకు సంబంధించిన అంశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరును స్పీకర్ తప్పు బట్టారు.ఈ రెండు అంశాలను అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ దృష్టికి తీసుకు వెళ్లనున్నారు. 

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సాగుతున్న తరుణంలో జంగారెడ్డిగూడెం మరణాలపై టీడీపీ సభ్యులు పట్టుబడుతున్నారు.ప్రతి రోజూ అసెంబ్లీలో నిరసనకు దిగుతూనే ఉన్నారు. ఇప్పటికే 9 మంది ఎమ్మెల్యేలు సెషన్ మొత్తం సస్పెండ్ అయ్యారు. గత వారంలో ఐదుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. నిన్న నలుగురు టీడీపీ సభ్యులను  సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు. ఇవాళ కూడా టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు.చిడతలు పట్టుకొని కూడా టీడీీపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలను రెండు రోజుల పాటు సభ నుండి సస్పెండ్ చేశారు. అసెంబ్లీ నుండి సస్పెండైన తర్వాత టీడీపీ ెమమ్మెల్యేలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios