అమరావతి: మందడం గ్రామానికి వెళ్లకుండా  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌ను వెంకటపాలెం వద్ద పోలీసులు అడ్డుకొన్నారు. దీంతో హైటెన్షన్ నెలకొంది. వెంకటపాలెం వద్ద రోడ్డుపై ముళ్లకంచె వేశారు. రహదారిపై ముళ్లకంచెను  తోసేశారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో పలువురు మందడం గ్రామస్థులు ముళ్లకంచెలో పడి గాయపడ్డారు.

Also Read:జగన్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు: పవన్

రాజధానికి చెందిన రైతులకు అండగా ఉంటామని మందడం గ్రామానికి చెందిన రైతులను  వద్దకు పవన కళ్యాణ్ వెళ్లకుండా పోలీసులు అడ్డుకొన్నారు. అయితే పవన్ కళ్యాణ్ కారు దిగి నడుచుకొంటూ వెళ్లారు ఆ సమయంలో పోలీసులతో పవన్ కళ్యాణ్ వాగ్వాదానికి దిగారు. కాలిస్తే కాల్చుకోండని పవన్ కళ్యాణ్ పోలీసులకు తల్చి చెప్పారు. 

ఈ సమయంలో మందడం వైపుకు వెళ్తున్న పవన్ కళ్యాణ్‌ను వెంకటపాలెం వద్ద పోలీసులు అడ్డుకొన్నారు. రోడ్డుపై ముళ్ల కంచె వేశారు. ముళ్లకంచె ను దాటుకొని పవన్ కళ్యాన్ అడ్డుకొనే ప్రయత్నం చేశారు. ముళ్లకంచెను లాగే క్రమంలో పలువురు మందడం గ్రామస్తులు ముళ్లకంచెలో పడ్డారు. దీంతో పలువురు రైతులకు గాయాలయ్యాయి.

Also Read:రాజధాని రచ్చ: రంగంలోకి భువనేశ్వరీ,భర్తతో కలిసి దీక్ష

వెంకటపాలెం వద్ద రోడ్డుపైనే పవన్ కళ్యాణ్ భైఠాయించారు.  దీంతో వెంకటపాలెం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు వ్యతిరేకంగా జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు.