Asianet News TeluguAsianet News Telugu

లోకేష్ రాజమండ్రి టూర్‌లో ఉద్రిక్తత:చెప్పులు, కుర్చీలు విసిరిన ఆందోళనకారులు

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నియోజకవర్గంలో మునికోడలి గ్రామంలో టీడీపీకి పురుషోత్తమపట్నం నిర్వాసితులకు మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. లోకేష్ పర్యటనను అడ్డుకొనేందుకు వైసీపీ శ్రేణులు, రైతులు ప్రయత్నించారు.

tension prevails at munikudali village in east godavari district
Author
Rajahmundry, First Published Mar 3, 2020, 5:52 PM IST


రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నియోజకవర్గంలో మునికోడలి గ్రామంలో టీడీపీకి పురుషోత్తమపట్నం నిర్వాసితులకు మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. లోకేష్ పర్యటనను అడ్డుకొనేందుకు వైసీపీ శ్రేణులు, రైతులు ప్రయత్నించారు.

Also read:గృహ నిర్బంధంలో ఉంచినా.. పోలీసుల కళ్లుగప్పి: అమరావతికి చింతమనేని

సీతానగరం మండలం మునికోడలిలో ఎన్టీఆర్ విగ్రహవిష్కరణ కార్యక్రమానికి లోకేష్ వెళ్తున్న సమయంలో పురుసోత్తమపట్నం నిర్వాసితులు అడ్డుకొన్నారు. వీరికి వైసీపీ  శ్రేణులు కూడ మద్దతుగా నిలిచారని టీడీపీ ఆరోపణలు చేసింది..పురుషోత్తపట్నం ప్రాజెక్టు  టీడీపీ కాంట్రాక్టర్‌కే న్యాయం చేశారని రైతులు ఆరోపిస్తున్నారు.

.ఇదే సమయంలో  ప్రజా చైతన్య యాత్రలో భాగంగా మునికోడలి వద్దకు వచ్చిన లోకేష్ కాన్వాయ్‌పై  కుర్చీలు విసిరేశారు. సీతానగరం మండలానికి ఏం న్యాయం చేశారని  రైతులు ప్రశ్నించారు. లోకేష్ కాన్వాయ్ వైపు చెప్పులు కూడ విసిరారు. 

పురుషోత్తపట్నం నిర్వాసితులు టీడీపీ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకొంది. వైసీపీ కార్యకర్తలు నిర్వాసితుల పేరుతో వచ్చి దాడికి దిగారని టీడీపీ ఆరోపణలు చేసింది. 

ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ తరుణంలో  నిరసనకారులను పోలీసులు నిలువరించారు.  దీంతో ఉద్రిక్తత నెలకొంది.  


 

Follow Us:
Download App:
  • android
  • ios