Asianet News TeluguAsianet News Telugu

గృహ నిర్బంధంలో ఉంచినా.. పోలీసుల కళ్లుగప్పి: అమరావతికి చింతమనేని

ఛలో అమరావతి నేపథ్యంలో చింతమనేనిని ముందస్తుగా పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. అటు రైతులను కూడా పోలీసులు అడ్డుకోవడంతో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇదే సమయంలో పోలీసుల కళ్లు గప్పిన చింతమనేని వేరే దారిలో అమరావతికి బయల్దేరినట్లుగా తెలుస్తోంది. 

Ex TDP MLA chintamaneni Prabhakar called for chalo amaravathi
Author
Amaravathi, First Published Mar 3, 2020, 2:58 PM IST

టీడీపీ సీనియర్ నేత, పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మంగళవారం ఛలో అమరావతికి పిలుపునిచ్చారు. ఆయన పిలుపుమేరకు రైతులు, టీడీపీ కార్యకర్తలు 200 కార్లలో ఆయన ర్యాలీగా అమరావతికి పయనమయ్యారు.

Also Read:జగన్ పై సొంత సోదరికే నమ్మకంలేదు... చింతమనేని

ఛలో అమరావతి నేపథ్యంలో చింతమనేనిని ముందస్తుగా పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. అటు రైతులను కూడా పోలీసులు అడ్డుకోవడంతో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.

దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇదే సమయంలో పోలీసుల కళ్లు గప్పిన చింతమనేని వేరే దారిలో అమరావతికి బయల్దేరినట్లుగా తెలుస్తోంది. రాజకీయాల్లో స్పీడుగా ఉండే చింతమనేని ప్రభాకర్ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో గత కొంతకాలంగా ఆయన సైలెంట్ అయ్యారు.

Also Read:కారణమిదే: చింతమనేని సైలెంట్, కోడి పందెలుంటాయా?

దీనితో పాటు వైసీపీ అధికారంలోకి వచ్చాక వరుస కేసుల్లో చింతమనేనిని అరెస్ట్ చేస్తూ వచ్చారు. దీంతో ప్రభాకర్ కాస్తంత ఇబ్బందిపడ్డారు. చివరికి సంక్రాంతి సీజన్‌లోనూ ఆయన హడావిడి లేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios