కార్యక్రమంలో 400 మందికన్నా పాల్గొనేందుకు లేదని పోలీసులు ఖచ్చితంగా చెప్పారు. దానికితోడు ఫంక్షన్ హాలు చుట్టుపక్కల ముందుజాగ్రత్తగా భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. ఎన్నడూ లేనివిధంగా ఫంక్షన్ హాలులో కూడా పెద్ద ఎత్తున పోలీసులుండబోతున్నారు. గుంటూరు రేంజి ఐజి సునీల్ కుమార్ ప్రత్యేకంగా ఒంగోలులో క్యాంపు వేసారంటేనే పరిస్ధితి ఏంటో అర్ధమవుతోంది.
అదే వేదిక...అదే మనుషులు..ఈసారి ఎదురుపడితే ఏమవుతుందో అర్ధంకాక టిడిపిలో ఆందోళన మొదలైంది. ప్రకాశం జిల్లా అద్దంకిలోని రెండు ఫ్యాక్షన్ గ్రూపులు మళ్ళీ ఎదురవ్వబోతున్నాయి. ఈరోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో ఏ1 కన్వెన్షన్ సెంటర్లో టిడిపి మినీమహానాడు కార్యక్రమానికి కరణం-గొట్టిపాటి గ్రూపులు హాజరవుతున్నాయి. దాంతో ఏక్షణంలో ఏం జరుగుతుందోనంటూ అందరిలోనూ టెన్షన్ మొదలైంది.
పార్టీ కార్యక్రమం, అందులోనూ మినీమహానాడు కాబట్టి ఇద్దరిలో ఏ ఒక్కరినీ రావద్దని అనేందుకు లేదు. పైగా కరణం బలరాం ఎంఎల్సీ, గొట్టిపాటి రవికుమార్ ఎంఎల్ఏ. దాంతో ఏం పార్టీ నేతలకు అర్ధంకావటం లేదు.
అందుకనే ముందుజాగ్రత్తగా మినీమహానాడుకు వచ్చేవారి సంఖ్యను బాగా తగ్గించేసారు. మామూలుగా అయితే, జిల్లా స్ధాయిల్లో జరిగే మినీమహానాడుకు ఎంతలేదన్నా 2 వేలమంది వస్తారు. ఒంగోలులో కూడా అదే విధంగా ప్లాన్ చేసుకున్నారు. అయితే, మంగళవారం ఏ1 కన్వెన్షన్ సెంటర్లో గొట్టిపాటి- కరణం మధ్య జరిగిన గొడవలో గొట్టిపాటిని కరణం క్రిందపడేసి, చొక్కాచించేసి కొట్టారు.
మొన్న జరిగిన అవమానానికి గొట్టిపాటి మండిపోతున్నారు. కరణం వర్గం ఎదురుబడితే ఎలా స్పందిస్తారో అన్న భయం జిల్లా నేతల్లో కనబడుతోంది. రెండువర్గాలు ఎదురైతే జరగబోయే గొడవను తలచుకుని ఎప్పుడేం జరుగుతుందో అని భయపడుతున్నారు.
కార్యక్రమంలో 400 మందికన్నా పాల్గొనేందుకు లేదని పోలీసులు ఖచ్చితంగా చెప్పారు. దానికితోడు ఫంక్షన్ హాలు చుట్టుపక్కల ముందుజాగ్రత్తగా భారీ ఎత్తున పోలీసులను మోహరించారు.
ఎన్నడూ లేనివిధంగా ఫంక్షన్ హాలులో కూడా పెద్ద ఎత్తున పోలీసులుండబోతున్నారు. గుంటూరు రేంజి ఐజి సునీల్ కుమార్ ప్రత్యేకంగా ఒంగోలులో క్యాంపు వేసారంటేనే పరిస్ధితి ఏంటో అర్ధమవుతోంది.
ఏ చిన్న గొడవ జరిగినా బాధ్యులను వెంటనే అదుపులోకి తీసుకుని కేసులు పెట్టాల్సిందిగా ప్రభుత్వంలోని ముఖ్యుల నుండి ఐజికి ప్రత్యేకంగా ఆదేశాలు అందాయట. అదే విషయాన్ని ఇటు గొట్టిపాటికి అటు కరణంకు రాష్ట్ర నాయకత్వం స్పష్టంగా చెప్పింది.
మిహానాడు అన్నది పార్టీ కార్యక్రమం. ఏ కారణం చేతనైనా మినీమహానాడు జరుపుకోలేకపోతే పార్టీ అధినేతకే అవమానం అన్న విషయాన్ని కూడా ఇద్దరు నేతలకు రాష్ట్ర నాయకత్వం స్పష్టంగా చెప్పింది. అయినాసరే ఏక్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళనైతే అందరిలోనూ స్పష్టంగా కనబడుతోంది.
