ఏ ముహూర్తంలో తెలంగాణా, ఆంధ్ర తనకు రెండు కళ్ళన్నారో అప్పటి నుండి ఓ తెలంగాణా కన్నులో నలుసులు పడి ఇబ్దంది పెడుతూనే ఉన్నాయి చంద్రబాబునాయుడును. కంట్లో నలుసు పడినప్పుడల్లా చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది.

ఏ ముహూర్తంలో తెలంగాణా , ఆంధ్ర తనకు రెండు కళ్ళన్నారో అప్పటి నుండి ఓ తెలంగాణా కన్నులో నలుసులు పడి ఇబ్దంది పెడుతూనే ఉన్నాయి చంద్రబాబునాయుడును. కంట్లో నలుసు పడినప్పుడల్లా చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది. ఎప్పుడో ‘ఓటుకునోటు’ కేసు బయటపడినపుడు అంతటి టెన్షన్ అనుభవించారేమో. మళ్ళీ రెండున్నరేళ్ళ తర్వాత అదే టెన్షన్ అనుభవిస్తున్నారు.

అప్పటి ఎంఎల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎంఎల్ఏ ఓటును కొనుగోలు చేయబోయి టిడిపి అడ్డంగా బుక్కయిపోయిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా టిటిడిపిలో ఫైర్ బ్రాండ్ గా పాపులరైన రేవంత్ రెడ్డి సోమవారం తన మద్దతుదారులతో సమావేశమవుతున్నారు.

ఇపుడా అంశమే చంద్రబాబును తీవ్రంగా కలవర పెట్టేస్తోంది. టిడిపితో పాటు ఎంఎల్ఏ పదవి కి కూడా రేవంత్ రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు హైదరాబాద్ లోని తన ఇంట్లో మద్దతుదారులతో సమావేశం అవుతున్నారు. నియోజకవర్గం కొడంగల్ నుండి జిల్లా, రాష్ట్రవ్యాప్తంగా తనకు మద్దతు పలికే వారికి రేవంత్ బహిరంగంగానే ఆహ్వనం పలికారు. సమావేశానికి రమ్మని చెప్పారు. దాంతో టిడిపిలో ముసలం మొదలైంది.

 తెలంగాణా వ్యాప్తంగా తనకు మద్దతుగా నిలిచేవారెవరన్న విషయం క్లారిటీ కోసమే ఈ సమావేశమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రేవంత్ కు మద్దతుగా ఇప్పటికే పలువురు బాహాటంగా మద్దతు పలకారు. అయితే, రేవంత్ కు మద్దతుగా నిలబడే వాళ్ళ సంఖ్య మరింత పెరుగుతుందని జరుగుతున్న ప్రచారమే టిడిపి ముఖ్యులను బాగా కలవరపెడుతున్నది. ప్రచారంలో ఉన్నదేమిటంటే? 31 జిల్లాల టిడిపి అధ్యక్షుల్లో 22 మంది రేవంత్ కు మద్దతు పలికారట.

అదేవిధంగా ప్రస్తుతం టిడిపి రాష్ట్ర కమిటీల్లో ఉన్నవారు, మాజీ మంత్రులు, మాజీ ఎంపిలు, మాజీ ఎంఎల్ఏలు పలువురు రేవంత్ వైపు చూస్తున్నారట. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తెలంగాణాలో టిడిపి దాదాపు తుడిచిపెట్టుకుపోతుందేమో అన్న అనుమానాలు మొదలయ్యాయి. అప్పటి టెన్షన్ కు తెలంగాణా వ్యవహారమే కారణమైతే, ఇప్పటి ఆందోళనకూ మళ్ళీ తెలంగాణాలోని పరిణామాలే కారణమవ్వటం యాధృచ్చికమేమో.