శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ పోరు రోజు రోజుకు తీవ్రతరమవుతుంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య రాజకీయ పోరు ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. అధికార వైసీపీపై ప్రతిపక్ష టీడీపీ, టీడీపీపై అధికార వైసీపీలు నిత్యం విమర్శలకు దిగుతోంది.

శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం, వైసీపీ నేతల మధ్య విబేధాలు ఏకంగా కోర్టుల వరకు వెళ్లిందంటే రాజకీయ పోరు ఎంతలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన శ్రీకాకుళంలో వైసీపీ ఘన విజయం సాధించింది. అప్పటి నుంచి జిల్లాలో రాజకీయ వైరం తారా స్థాయికి చేరుకుంది. 

తాజాగా ఎల్ఎన్ పేట మండలంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎన్ఆర్జీఎస్ సామాజిక తనిఖీ కార్యక్రమంలో తెలుగుదేశం వైసీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కుర్చీలతో దాడికి దిగారు. 

దాంతో సామాజిక తనిఖీ కార్యక్రమం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పలువురు వైసీపీ, టీడీపీ శ్రేణులకు గాయాలు కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. 

  అమరావతి స్మశానమైతే మీరు రాక్షసులా: వైసీపీపై మాజీమంత్రి కళా వెంకట్రావు ఫైర్