నంద్యాల ఆర్టీవో కార్యాలయం ఏజెంట్ కరీముల్లా వారం రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. కరీముల్లా కుటుంబంను ఆదుకోవాలని అతని కుటుంబ సభ్యులు, టీడీపీ, ముస్లిం సంఘాల నాయకులు మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు.
నంద్యాల మున్సిపల్ ఆఫీసు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. నంద్యాల ఆర్టీవో కార్యాలయం ఏజెంట్ కరీముల్లా వారం రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. కరీముల్లా కుటుంబంను ఆదుకోవాలని అతని కుటుంబ సభ్యులు, టీడీపీ, ముస్లిం సంఘాల నాయకులు మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. అయితే ఇందుకు అనుమతి లేదన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు, టీడీపీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కరీముల్లా కుటుంబానికి న్యాయం జరిగే వరరకు ధర్నా కొనసాగిస్తామన టీడీపీ నాయకులు తెలిపారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇక, నంద్యాల పట్టణంలోని రోజాకుంట వీధికి చెందిన కరీముల్లా ఆర్టీవో కార్యాలయంలో ఏజెంట్‌గా పని చేసేవాడు. అలా వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించేవాడు. అతడికి భార్య సమియాపర్వీన్, ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. 2019లో నంద్యాల ఆర్టీవో కార్యాలయంలో అవనీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. అయితే కరీముల్లా ఇచ్చిన అధికారులు దాడులు చేశారని.. ఆర్టీవో, ఎంవీఐలు భావించారు.
ఈ క్రమంలోనే కరీముల్లా నుంచి వచ్చే ఫైళ్లను తిరస్కరించేవారు. ఈక్రమంలోనే కరీముల్లా.. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్‌లో ఆర్టీవో కార్యాలయంలో అవినీతి జరుగుతుందని ఆరోపించారు. ఇందుకు సంబంధించి మృతుడి భార్య పర్వీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
