మచిలీపట్నం కలెక్టొరేట్ వద్ద ఉద్రికత్త (వీడియో)

Tension builds up at machilipatnam collectorate
Highlights

మచిలీపట్నం కలెక్టొరేట్ వద్ద ఉద్రికత్త (వీడియో)

కనీస వేతనం రూ.18000/-ఇవ్వాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు మచిలీపట్నం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఫీల్డు వర్క్ చేసే తమకు బయోమెట్రిక్ అటెండెన్స్ నుండి మినహాయింపు ఇవ్వాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసన ప్రదర్శనకోసం జిల్లా అన్ని ప్రాంతాల  నుండి అంగన్వాడీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. వారంతా కలక్టరేట్ లోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో  పోలీసులకు అంగన్వాడీలకు వాగ్వివాదం, తోపు లాట జరిగింది. పలువురి అరెస్టు కూడా చేశారు. తర్వాత పోలీసులకు అంగన్వాడీలకు వాగ్వి  వాదంలో యూనియన్ నాయకురాలు కమల పోలీసు అధికారులు దుస్తులు చించారని మచిలీపట్నం  స్టేషన్ వద్ద అంగన్వాడీల ఆందోళన కూడా చేశారు.సిఐ  క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

 

loader