కొత్త ఆవిష్కరణలకు పెద్ద పీట వేసే చంద్రబాబునాయుడు లాంటి వాళ్ళు కస్తూరీ రంగన్ చెప్పిన విషయాలపై కాస్త సీరియస్ గా దృష్టి సారిస్తే బాటుంటుందేమో.

చంద్రుడిపై కాలనీలు ఏర్పాటు సాధ్యమేనట. భారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ(ఇస్రో) మాజీ ఛైర్మన్ కస్తూరీ రంగన్ చెప్పినదాని ప్రకారమైతే భూమి వెలుపల ఆవాసాలు ఏర్పాటు కష్టమేమీ కాదు. కస్తూరి వారి మాట నిజమయ్యే రోజు వస్తే మన నేతలకు అంతకు మించిన సంతోషం ఇంకేముంటుంటి? ఎక్కడబడితే అక్కడ భూములు కొనుగోలు చేసే వ్యక్తులు, సంస్ధలు, కబ్జాలు చేసే నేతలు ఇక చంద్రుడిని కూడా ఓ చూపు చూడవచ్చేమో. మరికొన్ని పరిశోధనలు చేయటం ద్వారా చంద్రునిపై శాస్వత మానవ కాలనీలు ఏర్పాటు ఖచ్చితంగా సాధ్యమేనని బల్లగుద్ది మరీ చెబుతున్నారు కస్తూరి వారు. అయితే, శాస్వత ఆవాసాలు ఏర్పాటు చేసుకోవాలంటే మాత్రం మరిన్ని పరిశోధనలు చేయాలని చెబుతున్నారు.

చంద్రునిపైకి ప్రయోగిచిన చంద్రయాన్-1 జాబిల్లి ఉపరితలంపై 10 కిలోమీటర్ల సొరంగాన్ని శోధించినట్లు తెలిపారు. అందిన వివరాలను బట్టి చంద్రునిపై మానవ ఆవాసాలు సాధ్యమేనని అనిపిస్తోందన్నారు. మానవజాతి దీర్ఘకాల మనుగడ కోసం కొన్ని గ్రహాలపై దృష్టి సారించాలని చెప్పారు. సౌర కుటుంబంలోని గ్రహాలపై ఆవాసాలు ఏర్పాటు చేసుకునే విషయమై గట్టిగా కృషి చేయాలని కస్తూరి రంగన్ పేర్కొన్నారు. కొత్త ఆవిష్కరణలకు పెద్ద పీట వేసే చంద్రబాబునాయుడు లాంటి వాళ్ళు కస్తూరీ రంగన్ చెప్పిన విషయాలపై కాస్త సీరియస్ గా దృష్టి సారిస్తే బాటుంటుందేమో.