ఉక్రెయిన్ (ukraine ) నుంచి కొందరు విద్యార్ధులు క్షేమంగా బయటపడ్డప్పటికీ.. ఇంకా చాలా మంది అక్కడే ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో విశాఖకు చెందిన తెలుగు విద్యార్ధులు (telugu students) అక్కడ నరకయాతన అనుభవిస్తున్నారు. తమను భారత్‌కు పంపించాలటూ ఎంబసీ అధికారులను వేడుకుంటున్నారు విద్యార్ధులు.
ఉక్రెయిన్ (ukraine ) నుంచి కొందరు విద్యార్ధులు క్షేమంగా బయటపడ్డప్పటికీ.. ఇంకా చాలా మంది అక్కడే ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో విశాఖకు చెందిన తెలుగు విద్యార్ధులు (telugu students) అక్కడ నరకయాతన అనుభవిస్తున్నారు. తమను భారత్‌కు పంపించాలటూ ఎంబసీ అధికారులను వేడుకుంటున్నారు విద్యార్ధులు. బాంబు దాడులు, సైరన్‌ల మోతతో ఎప్పుడు ఎటు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందోనని వారు బిక్కుబిక్కుమంటున్నారు. నాలుగు రోజులుగా బంకర్లలోనే విద్యార్ధులు తలదాచుకుంటున్నారు. దీంతో తిండిలేక అవస్థలు పడుతున్నారు. ఈ మేరకు విశాఖ విద్యార్ధిని శ్రీజ పరిస్ధితిని తెలియజేస్తూ సెల్ఫీ వీడియో విడుదల చేసింది.
మరోవైపు.. ఉక్రెయిన్‌పై రష్యా యుద్దం నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది. భారత ప్రభుత్వం Operation Ganga పేరిట ఈ తరలింపు ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను ఆ దేశ సరిహద్దుల్లోని రొమేనియా, హంగేరి దేశాలకు తరలించేలా ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి వారిని రొమేనియా రాజధాని బుకారెస్ట్, హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లకు తరలిస్తున్నారు. బుకారెస్ట్, బుడాపెస్ట్‌లకు చేరుకన్న భారతీయులను ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తరలిస్తున్నారు.
ఇప్పటికే రెండు విమానాలు భారత్‌కు చేరుకున్నాయి. తొలి విమానం బుకారెస్ట్ నుంచి 219 మంది భారతీయలుతో శనివారం రాత్రి ముంబై ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంది. ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి చేరుకున్న వారికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలికారు. ఇక, రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి బయలుదేరిన రెండో విమానం ఆదివారం తెల్లవారుజామున Delhi airportకు చేరుకుంది. ఇందులో 250 మంది భారతీయులను ఇండియాకు తీసుకొచ్చారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ ఎయిర్‌పోర్ట్‌లో విద్యార్థులకు స్వాగతం పలికారు.
ఇక, ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులతో కూడిన మూడో విమానం కూడా స్వదేశానికి చేరుకుంది. హంగేరియన్ రాజధాని బుడాపెస్ట్ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. ఇందులో మొత్తం 240 మంది ఇండియన్స్ ఉన్నారు. భారతీయుల తరలింపులో భాగంగా బుడాపెస్ట్ నుంచి భారత్‌కు చేరిన తొలి విమానం ఇది. దీంతో ఉక్రెయిన్‌పై రష్యా యుద్దం మొదలైన తర్వాత భారత్ స్వదేశానికి తరలించిన భారతీయుల సంఖ్య 709కి చేరింది.
