Asianet News TeluguAsianet News Telugu

నారా లోకేశ్‌ పాదయాత్రకు బ్రేక్.. ప్రచారరథం సీజ్.. ఏం జరిగిందంటే..?

Vijayawada: యువ‌గ‌ళం పేరుతో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్  పాద‌యాత్ర చేప‌ట్టారు. యువగళం పాదయాత్ర గురువారం నాటికి ఏడో రోజుకు చేరుకుంది. ప్ర‌స్తుతం పలమనేరు నియోజకవర్గంలో యాత్ర కొనసాగుతోంది. ఈ పాద‌యాత్ర‌కు ప్రజలు, పార్టీ కార్య‌క‌ర్త‌లు పెద్దఎత్తున పాలుపంచుకుంటున్నారు. 
 

Telugu Desam Party (TDP) national general secretary Nara Lokesh's Yuvagalam padayatra campaign chariot seized by police
Author
First Published Feb 2, 2023, 3:58 PM IST

TDP-Nara Lokesh's Yuvagalam padayatra: యువ‌గ‌ళం పేరుతో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్  పాద‌యాత్ర చేప‌ట్టారు.  యువగళం పాదయాత్ర గురువారం నాటికి ఏడో రోజుకు చేరుకుంది. ప్ర‌స్తుతం పలమనేరు నియోజకవర్గంలో యాత్ర కొనసాగుతోంది. ఈ పాద‌యాత్ర‌కు ప్రజలు, పార్టీ కార్య‌క‌ర్త‌లు పెద్దఎత్తున పాలుపంచుకుంటున్నారు. అయితే, పలమనేరులో యువ‌గ‌ళం పాద‌యాత్ర కొద్ది దూరం ప్ర‌యాణించిన త‌ర్వాత పోలీసులు నారా లోకేశ్ కు షాకిచ్చారు.  ఆయ‌న ప్ర‌చార ర‌థాన్ని అడ్డుకున్నారు. దానిని ముందుకు సాగ‌కుండా అడ్డుకునీ, సీజ్ చేసి ప‌డేశారు. దీంతో అక్క‌డ ఉద్రిక్త‌త నెల‌కొంది. రోడ్డుపై టీడీపీ శ్రేణులు నిర‌స‌న‌కు దిగాయి. 

వివ‌రాల్లోకెళ్తే.. యువ‌గ‌ళం పాద‌యాత్ర ప్ర‌స్తుతం చిత్తూరు జిల్లాలోని ప‌ల‌మ‌నేరు నియోజ‌క‌వ‌ర్గంలో ముందుకు సాగుతోంది. అయితే, కొద్ది స‌మ‌యం త‌ర్వాత యాత్ర‌కు బ్రేక్ ప‌డింది. నారా లోకేశ్‌ కాన్వాయ్‌లోని ప్రచార రథాన్ని పోలీసులు అడ్డుకుని సీజ్‌ చేశారు. పాదయాత్ర కొనసాగుతుండగా ఒక ప్రాంతంలో ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడుతుండ‌గా ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. కొద్ది సేపు అక్క‌డ గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొంది. ప్ర‌చార‌ వాహ‌నాన్ని ముందుకు సాగ‌కుండా అడ్డుకోవ‌డంతో నారా లోకేశ్ - పోలీసుల‌కు మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎందుకు సీజ్ చేశారంటూ ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పోలీసులు, ప్ర‌భుత్వ తీరుపై మండిప‌డ్డారు. ఈ క్ర‌మంలోనే రోడ్డుపై భైఠాయించి నిర‌స‌న తెలిపారు. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నిన‌దిస్తూ..  జీవో నంబర్‌ 1 రాజ్యాంగానికి వ్యతిరేకమని పేర్కొన్నారు. 

ఈ సంఘ‌ట‌న‌పై పోలీసులు స్పందిస్తూ..  చెప్పారు. పాదయాత్రలో మైక్‌కు అనుమతి లేక‌పోవ‌డంతోనే సీజ్ చేసిన‌ట్టు పేర్కొన్నారు. అనంత‌రం ప్రచార రథాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్టు వెల్లడించారు. అయితే, టీడీపీ శ్రేణులు రోడ్డుపై భైఠాయించి న‌ర‌స‌న‌ల‌కు దిగ‌డంతో ఆ త‌ర్వాత వ‌దిలేశారు. దీంతో కొద్ది స‌మ‌యం త‌ర్వాత మ‌ళ్లీ నారా లోకేశ్ యువ‌గ‌ళం పాద‌యాత్ర ముందుకు సాగింది.

 

నారా లోకేశ్ యువ‌గ‌ళం 

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టనున్న పాదయాత్ర ప్రారంభ‌ నేప‌థ్యంలో  సంఘీభావం తెలిపేందుకు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాల నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణులు చిత్తూరులోని కుప్పంలో తరలివచ్చారు. యువగళం పాదయాత్రతో సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనకు స్వస్తి పలకడంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కుప్పంలో ప్రారంభ‌మైన పాద‌యాత్ర స‌మ‌యంలో హోటళ్లు, లాడ్జీలన్నీ పార్టీ కార్యకర్తలతో నిండిపోగా ఎక్కడ చూసినా టీడీపీ జెండాలు, బెలూన్లు, బ్యానర్లు కనిపించడంతో కుప్పం పసుపుమయంగా మారింది. వరదరాజస్వామికి ప్రత్యేక పూజల అనంత‌రం యాత్ర షురూ అయింది. కుప్పంలో ప్రారంభమైన యువగళం పాదయాత్ర  4000 కిలోమీటర్ల  కొన‌సాగ‌నుంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios