ఏపీ రాజధాని అమరావతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. శుక్రవారం విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న తలసాని అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీవి టెంపరరీ పాలిటిక్సేనని వ్యాఖ్యానించారు.

భారతీయ జనతా పార్టీ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఏ మాత్రం ఉండదని శ్రీనివాస్ యాదవ్ జోస్యం చెప్పారు. ఢిల్లీ నుంచి వచ్చిన నేతల మాటలు ఇక్కడ చెల్లవని ఆయన ఎద్దేవా చేశారు.

అమరావతిలో ఐదేళ్లు కాలయాపనతో ఏం జరిగిందో అందరికీ తెలుసునని.. రియాల్టీ ఉండాలి కానీ గ్రాఫిక్స్ కాదని తలసాని తేల్చి చెప్పారు. ఏపీ ప్రతిపక్షాల ఉద్యమాలపై తాను మాట్లాడటం సరికాదని, ఇది ఈ రాష్ట్ర వ్యవహారమని శ్రీనివాస్ యాదవ్ కుండబద్ధలు కొట్టారు.

అమరావతి రాజధానిపై ప్రస్తుత ప్రభుత్వం.. దీర్ఘకాలికంగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లుందని శ్రీనివాస్ యాదవ్ అభిప్రాయపడ్డారు.