తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ బెజవాడ కనకదుర్గమ్మకు బంగారు ముక్కుపుడకను కానుకగా సమర్పించారు. బుధవారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి విజయవాడ ఇంద్రకీలాద్రికి చేరుకున్న కొప్పులకు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేశారు.

వేదపండితులు మంత్రి కుటుంబసభ్యులకు ఆశీర్వచనం చేయగా.. ఆలయ ఈవో సురేశ్ బాబు అమ్మవారి ప్రసాదము, చిత్రపటము అందజేశారు. అనంతరం మంత్రి కొప్పుల బంగారు ముక్కుపుడకను ఆలయ అధికారులకు అందజేశారు.