తిరుమల: తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, గౌరవ ప్రధానార్చకులు రమణ దీక్షితులు మధ్య నెలకొన్న కోల్డ్ వార్ ఇప్పుడు మరింత ఎక్కువయ్యి రాజకీయ దుమారంగా మారింది. 

గత ప్రభుత్వం 65 సంవత్సరాలను అర్చకుల రిటైర్మెంట్ వయసుగా గత ప్రభుత్వం ఇచ్చిన జీవో పై ఎటు తేల్చకుండానే రమణదీక్షితులును ఎలా గౌరవాధ్యక్షులుగా మల్లి తీసుకుంటారని టీటీడీ బోర్డుపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. 

గతంలో తిరుమలలో ఎన్నో విలువైన రత్నాలు, వజ్రాలు కనిపించడంలేదని రమణ దీక్షితులు గత టీడీపీ ప్రభుత్వంపై అనేక విమర్శలు చేసాడు. ఆయన అప్పట్లో కేంద్ర పెద్దలను కూడా కలిసి ఈ విషయంపై వారికి ఫిర్యాదు చేసారు కూడా.

Also read; వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీకి హైకోర్టు కీలక ఆదేశాలు

ఈ పరిణామాల నేపథ్యంలో అప్పటి టీటీడీ బోర్డు చైర్మన్ గా ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్ అర్చకులకు కూడా రిటైర్మెంట్ వయసును ప్రవేశ పెడుతున్నట్టు ఒక తీర్మానం చేశారు. 

ఈ తీర్మానాన్ని అమలు చేస్తూ రమణ దీక్షితులుతో సహా మరో ముగ్గురు అర్చకులను తీసివేసింది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో కూడా మరో ఇద్దరు అర్చకులను తొలగించింది టీటీడీ. 

ఈ అర్చకులు టీటీడీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కోర్టు మెట్లెక్కారు. టీటీడీ ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ హైద్రాబాబ్డ్ హైకోర్టు వీరిని వెంటనే అర్చకత్వ బాధ్యతల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలిచ్చినప్పటికీ గత ప్రభుత్వం వారిని నియమించకుండా త్థసారం చేసింది. ఆ తరువాత జగన్ అధికారంలోకి రాగానే వారిని తిరిగి తీసుకున్నారు. 

వాస్తవానికి మొన్న రమణ దీక్షితులికి, వేణుగోపాల దీక్షితులికి మధ్య గర్భగుడిలోని వాగ్వివాదం జరిగింది. ఇది ఎంతటి భారీ స్థాయిలో జరిగిందంటే...అక్కడ మిగిలి ఉన్న అర్చకులంతా వారిద్దరిని విడదీసేంతగా. శ్రీవారికి పూలను ఎక్కడి నుండి తెప్పిస్తున్నారు, ఆ కాంట్రాక్టు విషయంలో చిన్నగా మొదలైన గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. 

Also read: ఆంధ్రజ్యోతిపై వంద కోట్లకు దావా, రమణదీక్షితులు రీఎంట్రీ: టీటీడీ

ఇదొక్కటే కాకుండా...స్వామివారి ముందు వెలిగించే దీపంలో పొసే నెయ్యిని రమణ దీక్షితులు ఇంటి నుండి తీసుకురావడాన్ని కూడా వేణుగోపాల దీక్షితులు వ్యతిరేకించినట్టు తెలియవస్తుంది. ఇలా నెయ్యిని ఇంటి నుండి తీసుకురావడం ఆగమ శాస్త్ర నియమాలకు విరుద్ధం అని వారు వాదిస్తున్నారు. 

గతంలో కూడా చాలా వివాదాలకు రమణదీక్షితులు కేంద్రబిందువు. అప్పట్లో స్వామివారి నామాల తీరును మార్చారని పెద్ద దుమారమే చెలరేగింది. తెంగలై, వడగాలై వర్గాల మధ్య ఉన్న విభేదాలు అప్పుడు భగ్గుమన్నాయి. ఇలాంటి వివాదాస్పద వ్యక్తిని తిరిగి నియమించే ముంది ఇలాంటి విషయాలన్నింటిని కూడా పరిగణలోకి తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.