విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేయబోతున్న ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ లు విజయవాడ చేరుకున్నారు. 

ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 12.23 గంటలకు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎంగా చేయబోతున్న ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నారు. ఇకపోతే తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం మరికాసేపట్లో విజయవాడ చేరుకుంటారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకుంటారు. 

అక్కడ నుంచి 12.08 గంటలకు తాజ్ గేట్ వే హోటల్ కు చేరుకుంటారు. అనంతరం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జగన్ ప్రమాణ స్వీకారానికి టీఆర్ఎస్ నేతలతో కలిసి పాల్గొంటారు. ప్రమాణ స్వీకారం అనంతరం తాజ్ గేట్ వే హోటల్ లో లంచ్ చేసి అనంతరం ఢిల్లీ వెళ్తారు కేసీఆర్.