తిరుమల: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సమర్థవంతమైన పాలన అందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలుగు రాష్ట్రాల ప్రజలు, ప్రభుత్వాలు సత్సంబంధాలతో కలిసి ఉండాలని ఆకాంక్షించారు. 

ఇరు రాష్ట్రాలు ఇచ్చుపుచ్చుకునే ధోరణిలో వనరులను ఉపయోగించుకోవాలన్నారు. కలిసికట్టుగా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుని అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. భవిష్యత్ లో తెలుగు రాష్ట్రాలు మరింత అభివృద్ధి చెందుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.