Asianet News TeluguAsianet News Telugu

ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలు ఎగ్గొట్టడానికే తెలంగాణ ప్రయత్నం : పెద్దిరెడ్డి

తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలను ఎగ్గొట్టాలని ఏపీ ప్రయత్నిస్తుందని మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి మీడియా సమావేశంలో అన్నారు.

Telangana attempt to evade electricity dues due to AP : Peddireddy
Author
First Published Sep 12, 2022, 8:42 AM IST

తిరుపతి : ఢిల్లీ లిక్కర్ స్కాంతో ఏపీ ప్రభుత్వానికి సంబంధం లేదని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఉద్దేశపూర్వకంగానే జగన్ కుటుంబీకులకు అంటగడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  తెలంగాణ నుంచి రూ. 6వేల కోట్ల విద్యుత్ బకాయిలు రావాల్సి ఉందన్నారు. ఏపీకి రావాల్సిన బకాయిలు ఎగొట్టడానికి  తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి ఆరోపించారు. 

ఏపీ రూ.1,700 కోట్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించిందని  వెల్లడించారు. ఈ నెల 22న సీఎం  జగన్  కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తారని తెలిపారు. కుప్పంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మూడో విడత చేయూత పథకాన్ని సిఎం ప్రారంభిస్తారని పెద్దిరెడ్డి వివరించారు. 

ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 4న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. ఈ రెండు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించడం ద్వారా రెండు రాష్ట్రాలకూ ప్రయోజనం కలుగుతుంది అన్నారు. కేరళలోని ని తిరువనంతపురంలో సెప్టెంబర్ 3 నాడు దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ సమావేశంలో కేంద్ర మంత్రి అమిత్ షా ప్రసంగించారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరి సమస్య ఉందని, అలాగే తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా నదీ జలాల మధ్య వివాదాలు ఉన్నాయని.. వీటికి పరిష్కారాలను కనుగొనాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి అమిత్ షా అభిప్రాయపడ్డారు.

ఏపీకి నెల రోజుల్లో విద్యుత్ బకాయిలు చెల్లించాలి: తెలంగాణకు కేంద్రం ఆదేశం

నెల రోజుల్లోగా ఏపీకి రూ. 6,756 కోట్లు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఆ  సమావేశంలో ఈ ఆదేశాలపై తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాదు, తెలంగాణకు ఏపీ ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల విషయమై.. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేయకపోవడాన్ని వారు ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్దంగా ఉన్నాయని తెలంగాణ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రతినిధులు అన్నారు. తెలంగాణకు ఏపీ నుండి రూ. 12 వేల కోట్లు రావాల్సిన విషయాన్ని గుర్తు చేశారు.

రాష్ట్రాలు విడిపోయి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు కావొస్తున్నా కూడా కృష్ణా నీటిలో తెలంగాణ వాటాను కేంద్రం  ఇంకా నిర్ణయించకపోవడంపై తెలంగాణ ప్రతినిధి బృందం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇరిగేషన్ ఇన్ చీఫ్ హరిరామ్, ట్రాన్స్ కో జేఎండీ వి.శ్రీనివాసరావు, అదనపు డీజీపీ స్వాతి లక్రా తదితరులు పాల్గొన్నారు. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో 26 అంశాలపై చర్చించారు. వీటిలో 9 అంశాలను పరిష్కరించారు. మరో 17 అంశాలను తదుపరి పరిశీలన కోసం రిజర్వ్ చేశారు. పరిష్కారమైన 9 అంశాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios