Asianet News TeluguAsianet News Telugu

ఏడాది కాలంలో 36 అవార్డులు: టెక్నాలజీ వినియోగంలో దూసుకెళ్తున్న ఏపీ

టెక్నాలజీ వినియోగంలో ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖకు అవార్డుల పంట పండింది. సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో జాతీయ స్థాయి లో పది అవార్డులను ఏపీ సొంతం చేసుకుంది

technology sabha awards 2020 won by ap police
Author
Amaravathi, First Published Aug 25, 2020, 2:55 PM IST

టెక్నాలజీ వినియోగంలో ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖకు అవార్డుల పంట పండింది. సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో జాతీయ స్థాయి లో పది అవార్డులను ఏపీ సొంతం చేసుకుంది.

ఈ ఏడాదికి ఇప్పటికే 26 అవార్డులను గెలుచుకుని సత్తా చాటిన ఏపీ పోలీస్ శాఖ.. మరో పది అవార్డులను కైవసం చేసుకుంది. టెక్నికల్ విభాగంలో 7 అవార్డులు, అనంతపురం జిల్లాకు 2, సీఐడీ 4ఎస్ 4 యూ విభాగానికి 1 అవార్డు దక్కాయి.

ఏడాది వ్యవధిలో  రికార్డ్ స్థాయిలో 36 అవార్డులను దక్కించుకున్న ఏకైక ప్రభుత్వ విభాగంగా ఏపీ పోలీస్ శాఖ చరిత్ర సృష్టించింది. టెక్నాలజీ వినియోగం లో ఎపి పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలీస్ శాఖకు ఇస్తున్న ప్రాముఖ్యతతోనే సత్ఫలితాలు సాధిస్తున్నట్లు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. వెబినార్ ద్వార అవార్డులను అందుకున్నారు డీజీపీ.

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీ హరీష్ కుమార్ గుప్త, ఐ.జి పర్సనల్ మహేష్ చంద్ర లడ్డా, ఐ. జి. పి అండ్ ఎల్ నాగేంద్ర కుమార్, టెక్నికల్  డి.ఐ.జీ పాలరాజు, డి.ఐ.జీ రాజశేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios