వైజాగ్ మహానాడు  తనకు తీరని అవమానం జరిగిందని, గతంలో ఎన్నడూ లేనట్లుగా తనను అవమానించి పంపిస్తున్నారంటూ సినీ నటి, తెదేపా ఆర్గనైజింగ్ కార్శదర్శి కవిత ఆవేదన వ్యక్తం చేశారు.

విశాఖ మహానాడు కార్యక్రమంలో తనకు తీరని అవమానం జరిగిందని.. గతంలో ఎన్నడూ లేనట్లుగా తనను అవమానించి పంపిస్తున్నారంటూ సినీ నటి, తెదేపా ఆర్గనైజింగ్ కార్శదర్శి కవిత ఆవేదన వ్యక్తం చేశారు.

విశాఖ ఏయూలో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కవితను వేదికపైకి ఆహ్వానించలేదు.

దీంతో తీవ్ర కలత చెందిన ఆమె కన్నీరు పెట్టుకుని బయటకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ‘పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తనను ఎంతో గౌరవించి వేదికపై కూర్చోబెట్టారు.. పార్టీ కోసం కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి కష్టపడ్డాను. అలాంటి తనను పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కన పెట్టటం బాధగా ఉంది.

ఈ అవమానం కారణంగా పార్టీకి రాజీనామా చేసే ఆలోచన వస్తోంది’ అని అన్నారు.