త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసేందుకు పలువురు ఆశావహులు పోటీ పడుతున్నారు. టికెట్ కావాలని ఆశపడుతున్న వారు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచన మేరకు ఆశావహుల నుంచి భారీగానే స్పందన వస్తోంది.

విజయవాడలోని పార్టీ కార్యాలయానికి వ్యక్తిగతంగా రావడంతో పాటు, ఈ మెయిల్స్, వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునేవారు రోజు రోజుకి పెరుగుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా క్రికెటర్ వేణుగోపాల్ రావు కూడా తనకు టికెట్ కేటాయించి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలంటూ దరఖాస్తు చేస్తున్నారు.

దీనిలో భాగంగా మాదాసు రంగారావు నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీకి మంగళవారం తన దరఖాస్తును అందజేశారు. విశాఖపట్నానికి చెందిన వేణు దేశవాళీ క్రికెట్‌తో పాటు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.