Asianet News TeluguAsianet News Telugu

పీఆర్సీ రగడ.. రేపటి నుంచి రోడ్డెక్కనున్న ఉపాధ్యాయులు, గురువారం కలెక్టరేట్ల ముట్టడి

ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సచివాలయ ఉద్యోగులు పోరుబాటపట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా ఉపాధ్యాయులు సైతం రోడ్డెక్కేందుకు సిద్ధమయ్యారు. రేపటి నుంచి రాష్ట్రంలో కలెక్టరేట్ల ముట్టడికి ఉపాధ్యాయ సమాఖ్య పిలుపునిచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన జీవో రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

teachers union ready to protest over prc
Author
Amaravathi, First Published Jan 19, 2022, 4:43 PM IST

ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సచివాలయ ఉద్యోగులు పోరుబాటపట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా ఉపాధ్యాయులు సైతం రోడ్డెక్కేందుకు సిద్ధమయ్యారు. రేపటి నుంచి రాష్ట్రంలో కలెక్టరేట్ల ముట్టడికి ఉపాధ్యాయ సమాఖ్య పిలుపునిచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన జీవో రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

కాగా.. Andhra Pradesh  ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల నేతలు ఈ నెల 7వ తేదీన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 23.29 శాతం పీఆర్సీ ఫిట్‌మెంట్ ఇస్తామని సీఎం Ys Jagan హామీ ఇచ్చారు. అంతేకాకుండా పెండింగ్ లోని ఐదు D.A లను ఒకే సారి ఇస్తామని హమీ ఇచ్చారు. ఫిట్‌మెంట్ కనీసం 27 శాతానికి తగ్గకుండా ఉండాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే పెండింగ్ డిఏలు ఒకేసారి ఇస్తామని హమీ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందించాయి.

ఈ భేటీ తర్వాత Hraవిషయమై Chief Secretary నేతృత్వంలోని కమిటీతో ఉద్యోగ సంఘాలు సంక్రాంతి పర్వదినం కంటే ముందే పలు దఫాలు భేటీ అయ్యారు. కానీ ఈ సమావేశాల్లో ఉద్యోగ సంఘాల డిమాండ్ పై ప్రభుత్వం నుండి స్పష్టత రాలేదు.  అయితే ఈ నెల 17వ తేదీ రాత్రి పీఆర్సీపై  ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. ఈ జీవోల్లో హెచ్ఆర్‌ఏను భారీగా తగ్గించడంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. 30 శాతంగా ఉన్న హెచ్ఆర్ఏ స్థానంలో 16 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వడంతో తాము 14 శాతం నష్టపోతున్నామని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో కొత్త PRC తో ఎవరి జీతాలు తగ్గవని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి Sameer Sharma స్పష్టం చేశారు. కరోనాతో రాష్ట్ర ఆదాయం పడిపోయిందని సమీర్ శర్మ తెలిపారు.Andhra pradesh రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మూడు  పీఆర్సీ జీవోలపై Employees  సంఘాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.ఈ జీవోలను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాయి. 

ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ బుధవారం నాడు మీడియాతో మాట్లాడారు. గత పరిస్థితులకు  ఇప్పటికీ చాలా తేడా ఉందన్నారు. Corona లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 98 వేల  కోట్ల Incomeవచ్చేదన్నారు.కరోనా కారణంగా రాష్ట్రానికి ఆదాయం తగ్గిందని ఆయన చెప్పారు. ఆదాయాన్ని, ఖర్చులను బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుందన్నారు. కరోనా కష్టకాలంలో కూడా ఐఆర్ ఇచ్చామన్నారు.

కరోనా థర్డ్ వేవ్ వల్ల మరింత నష్టం జరిగే అవకాశం ఉందని సీఎస్ సమీర్ శర్మ అభిప్రాయపడ్డారు.  ఐఆర్ కంటే జీతంలో భాగం కాదన్నారు. పీఆర్సీ వల్ల గ్రాస్ శాలరీలో ఏ మాత్రం తగ్గదని సీఎస్ స్పష్టం చేశారు. హెచ్ఆర్ తగ్గందా? ;పెరిగిందా అనేది వేరే అంశమన్నారు. జీతాల్లో కోత మాత్రం పడే అవకాశమే లేదని ఆయన స్పష్టం చేశారు.ఐఎఎస్ లకు ఎక్కువ జీతాలు వస్తున్నాయనడం అవాస్తవమని సీఎస్  సమీర్ శర్మ తెలిపారు.కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పీఆర్సీని ఫాలో అవుతున్నామన్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios