విజయవాడ: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయురాలు అదుపుతప్పింది. సహనం కోల్పోయిన ఆమె విద్యార్థిపై విచక్షణంగా దాడి చేసింది. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకపోవడంతో విద్యార్థిపై విరుచుకుపడింది.

బెత్తంతో దాష్టీకానికి దిగింది. ఉపాధ్యాయురాలు దెబ్బలతో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా నందిగామలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే నందిగామలోని ఓ ప్రైవేట్ స్కూల్లో పఠాన్ వేదిష్ అనే విద్యార్థి రెండో తరగతి చదువుతున్నాడు.

టీచర్ మూడు ప్రశ్నలు అడగడంతో విద్యార్థి ప్రశ్నలు చెప్పకపోవడంతో మ్యాథ్స్ టీచర్ జయలక్ష్మి ఆగ్రహం చెందింది. వేదిష్ పై వాతలు తేలెటట్లు కొట్టారు. ఇంటికి వెళ్లిన తర్వాత కుమారుడిపై వాతలు చూసిన తల్లి సునీత ఆరా తీయగా అసలు విషయం చెప్పాడు. 

దాంతో కుమారుడిని తీసుకుని తల్లి సునీత ప్రిన్సిపాల్ నుంచి వింత సమాధానాలు రావడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపోతే విద్యార్థిపై దాడికి పాల్పడ్డ మ్యాథ్స్ టీచర్ జయలక్ష్మి సెలవు పెట్టడం విశేషం.