టిడిపి, వైసిపి ఫైట్ ఎఫెక్ట్... తాడేపల్లి జగన్ నివాసంవద్ద భారీ పోలీస్ బందోబస్తు
ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసం వద్ద టిడిపి,వైసిపి శ్రేణుల పరస్పర దాడులతో అప్రమత్తమైన పోలీసులు తాజాగా తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం వద్ద బందోబస్తును కట్టుదిట్టం చేశారు.
అమరావతి: టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఇంటివద్ద ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. వైసిపి శ్రేణులు టిడిపి అధినేత ఇంటిపైకి వెళ్లారు కాబట్టి ప్రతీకారంగా టిడిపి శ్రేణులు సీఎం జగన్ నివాసంవద్ద ఆందోళనకు దిగవచ్చని అనుమానిస్తున్నారు. దీంతో సీఎం జగన్ నివాసం వైపు వెళ్లే అన్నిదారులను పోలీసులు మూసివేయడమే కాదు దారిపొగవునా పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేశారు. అంతేకాకుడా సీఎం నివాసం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ట్రాఫిక్‌ను జాతీయ రహదారిపైకి మళ్లించారు.
అమరావతిలోని మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఇంటి ముట్టడికి పెడన ఎమ్మెల్యే జోగి రమేష్, వైసీపీ నాయకులు ప్రయత్నించారు. వైసీపీ నేతలు జెండాలు, కర్రలతో బాబు ఇంటి వద్దకు వచ్చారు. ఈ క్రమంలోనే అక్కడికి టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా భారీగా చేరుకున్నారు. దీంతో టిడిపి, వైసీపీ నేతల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.
read more మంగళగిరి పోలీస్ స్టేషన్లో జోగి రమేష్... టిడిపి శ్రేణులు భారీగా పోగవడంతో ఉద్రిక్తత, గేటుకు తాళం
పార్టీ జెండాల కర్రలతో, రాళ్లతో పరస్పరం వైసిపి,టిడిపి శ్రేణులు దాడులకు దిగాయి. ఈ రాళ్లదాడిలో ఎమ్మెల్యే రమేష్ కారు ధ్వంసమయ్యింది. తనపైనా టిడిపి వాళ్లు దాడి చేశారని ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ తోపులాట, పరస్పర దాడిలో టిడిపి నాయకులు బుద్దా వెంకన్న సొమ్మసిల్లి పడిపోయారు. పరిస్థితి చేయిదాటిపోవడంతో పోలీసులు లాఠీచార్జీ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు.
అయితే చంద్రబాబు ఇంటివద్ద పరిస్థితి ప్రశాంతంగా మారి ప్రస్తుతం తాడేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇప్పటికే తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా స్టేషన్ వద్దకు టిడిపి శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోన సీఎం జగన్ నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
చంద్రబాబు ఇంటివద్ద జరిగిన టిడిపి, వైసిపి శ్రేణుల ఘర్షణలో మాజీ ఎమ్మెల్యే బుద్దా వెంకన్న స్వల్పంగా గాయపడ్డారు. వైసిపి ఎమ్మెల్యే జోగి రమేష్ నేత్రుత్వంలో ఆ పార్టీ నాయకులు చంద్రబాబు ఇంటి ముట్టడికి ప్రయత్నించగా వారిని నిలువరించేందుకు స్వయంగా బుద్దా వెంకన్న రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే టిడిపి, వైసిపి శ్రేణుల మధ్య తోపులాట, పరస్పరం కర్రలు, రాళ్లతో దాడి చోటుచేసుకుంది. దీంతో బుద్దా వెంకన్న సొమ్మసిల్లి రోడ్డుపైనే పడిపోయారు.
వైసిపి ఎమ్మెల్యే జోగి రమేష్ పై టిడిపి కార్యకర్తలు దాడి చేశారు. రాళ్ళదాడిలో ఆయన కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. టీడీపీ, వైసిపి నాయకులు పరస్పరం తోపులాటకు దిగి రాళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ రాళ్ల దాడిలో పలువురు నాయకులకు తీవ్ర గాయాలయ్యాయి. వైసీపీ కార్యకర్తలు వీధిరౌడీల్లా వ్యవహరిస్తున్నారని టీడీపీ నాయకుల ఆగ్రహం వ్యక్తం చేశారు.