నంద్యాల్లో విజయోత్సవ సభ. కృత‌జ్ఞ‌త‌గా నిర్వ‌హిస్తున్న టీడీపీ నేత‌లు. హామీల అమలు పై ప్రజలకు మరింత క్లారిటీ కోసం నంద్యాల తిరుగు ప్రయాణం.
నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించినందుకు విజయోత్సవ సభను నిర్వహిస్తున్నారు. నంద్యాల నియోజక వర్గంలో వివిధ ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలందరిని శుక్రవారం పర్యటించాలని సీఎం ఆదేశించారు. ఎన్నికల సమయంలో తామిచ్చిన హామీలపై మరింత స్పష్టత కోసం సమావేశాలు జరపాలని సీఎం చెప్పారు. ఎలాగు మంత్రులు, నేతలు బారీ ఎత్తున నంద్యాలకు వస్తున్నారు కాబట్టి పనిలో పనిగా విజయోత్సవ సభను కూడా నిర్వహిస్తున్నారు. సభను ఘనంగా నిర్వహించడానికి భూమా కుటుంబం ప్రయత్నాలు ప్రారంభించింది.
ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలతో కూడిన జాబితా సిద్ధం చేసి తనకు అందజేయాలని నాయకులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. నంద్యాల్లో ప్రజలను కలిసి వారితో చర్చించి హామీల పై స్పష్టంగా వివరించండన్నారు. నంద్యాల ఉప ఎన్నికను 2019 సాధారణ ఎన్నికలకు నమూనగా భావిస్తున్నందున రోజంతా ఉండి అయినా సమాచారాన్ని సేకరించాలన్నారు. సమాచారాన్ని అంతా ఒక బుక్ రూపంలో తీసుకురండన్నారు. వచ్చే నెల జరిగే టీడీపీ వర్క్ షాపులోపు పుస్తకం సిద్దం కావాలని ఆయన నాయకులకు సూచించారు.
