గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి దారుణమైన ఫలితాలు వస్తాయని జోస్యం చెప్పారు. 

తన అంచనా ప్రకారం టీడీపీ 13 సీట్ల కంటే ఎక్కువ, 25 సీట్ల కంటే తక్కువగా గెలుస్తుందన్నారు. అంతేకానీ 130 సీట్లు వచ్చే ఛాన్స్ లేదన్నారు. 130 సీట్లు వస్తాయని చంద్రబాబు, ఆ పార్టీ నేతలు చెప్పడం హాస్యాస్పదమన్నారు. 

గుంటూరు జిల్లాలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాలు, మూడు పార్లమెంట్‌ స్థానాల్లో టీడీపీ బోణి కొట్టదన్నారు. మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో మంత్రి నారా లోకేష్ దారుణంగా ఓడిపోతారని చెప్పుకొచ్చారు. 

సుమారు 20 వేల ఓట్ల తేడాతో లోకేష్ పరాజయం పాలవుతారన్నారు. ఏపీలో జరిగిన ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అనే విధానంగా జరిగాయని గుంటూరు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.