Asianet News TeluguAsianet News Telugu

అధికారంలోకి రావాలి, ఏపీని పునర్నిర్మించాలి: చంద్రబాబు


ఏ పదవి ఇచ్చినా కూడా కంభంపాటి రామ్మోహన్ ఆ పదవులకు వన్నెతీసుకొచ్చారని చంద్రబాబు చెప్పారు. నేను-టీడీపీ పుస్తకాన్ని కంభంపాటి రామ్మోహన్ రావు రచించారు.ఈ పుస్తకాన్ని ఇవాళ ఆవిష్కరించారు. ఈ సభలో బాబు ప్రసంగించారు.
 

TDP will get power in AP says  Chandrababu
Author
Hyderabad, First Published Mar 28, 2022, 8:52 PM IST

హైదరాబాద్: ఏపీ రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావడమే కాదు, ఏపీని పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని టీడీపీ చీఫ్, మాజీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. హైద్రాబాద్ లోని ఓ హోటల్‌లో  నేను -టీడీపీ అనే పుస్తకాన్ని మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు రచించారు. ఈ పుస్తకాన్ని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు సోమవారం నాడు రాత్రి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా Chandrababu ప్రసంగించారు. ఏ పదవి అప్పగించినా కూడా రామ్మోహన్ రావు భాద్యతాయుతంగా నిర్వర్తించారన్నారు. స్వంతంగా వ్యాపారం చేసుకొంటూ రాజకీయాల్లో నడిచారన్నారు.  రాజకీయంగానే వ్యాపారంగా చేసుకొంటేనే అనేక సమస్యలు వస్తాయన్నారు.  ఏ పనిని అప్పగించినా కూడా kambhampati Rammohan Rao సిన్సియర్ గా నిర్వర్తించాడన్నారు.

40 ఏళ్ల క్రితం TDP ని NTRఎక్కడ ప్రకటించారో అదే హైద్రాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో రేపు సమావేశం కానున్నట్టుగా ఆయన చెప్పారు. తమ పార్టీ 40 ఏళ్ల క్రితం ఎందుకు ఆవిర్భావించిందనే విషయమై మననం చేసుకొంటామన్నారు. వచ్చే ఏడాది ఎన్టీఆర్ ది వంద ఏళ్ల జయంతి కార్యక్రమం ఉంటుందన్నారు.

ఎన్టీఆర్ ఆనాడు వేసిన పౌండేషన్ ఇప్పటికీ కూడా పార్టీ పటిష్టంగా ఉందన్నారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కూడా పార్టీ పటిష్టంగా ఉందని చంద్రబాబు చెప్పారు. CPI  నారాయణ సిద్దాంతం కోసం పనిచేస్తారన్నారు.తాము ప్రజల మేలు కోసం పనిచేస్తామని చంద్రబాబు సీపీఐ నారాయణను చూస్తూ చమత్కరించారు. సీపీఐ నేతలు సిద్దాంతపరంగా పోరాటం చేయడాన్ని కూడా తాము మనస్పూర్తిగా మద్దతిస్తున్నట్టుగా చంద్రబాబు చెప్పారు. అధికారం ద్వారా ప్రజల జీవితాలకు వెలుగు చూపడమే తమ పార్టీ సిద్దాంతమని బాబు చెప్పారు.తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో ఉంటారన్నారు.

 ఎన్టీఆర్ తీసుకొచ్చిన పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దు, మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించడం, రూ. కిలో బియ్యం వంటి పథకం ఆహార భద్రతకు కారణమైందని చంద్రబాబు గుర్తు చేశారు. నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ ను ఓడించిన ఘనత ఎన్టీఆర్ కే దక్కిందన్నారు. పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ పనిచేసిందని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

తాను ప్రజాహితం కోసమే పనిచేశానన్నారు. తాను చేసిన అభివృద్ది ఇప్పటికీ కనిపిస్తుందన్నారు. గతంలో తాను ఐటీ అంటే  ప్రతి ఒక్కరూ తనను విమర్శించారన్నారు. ఉమ్మడి ఏపీలో తాను పెట్టిన ఇంజనీరింగ్ కాలేజీల ద్వారా చదువుకున్న విద్యార్ధులు విదేశాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు.  టీడీపీతో కంభంపాటి రామ్మోహన్ రావుకు ఉన్న అనుబంధం ఈ పుస్తకం దోహదపడుతుందన్నారు. సరైన పథకాలను తీసుకొస్తే రానున్న తరాలు కూడా బాగుపడతాయన్నారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios