Asianet News TeluguAsianet News Telugu

ANDHRA PRADESH: గుడివాడలో క్యాసినో గ్యాంబ్లింగ్‌.. నృత్యాల పై ఎస్పీకి టీడీపీ ఫిర్యాదు

ANDHRA PRADESH: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు అంరంగం వైభవంగా జరిగాయి.  అయితే, పేకాట, కోడిపందాలు, క్యాసినో గ్యాంబ్లింగ్ వంటి పందాల్లో మూడు రోజుల్లో కోట్లాది రూపాయల మేరకు చేతులు మారాయి. ముఖ్యంగా, రాష్ట్ర పౌరసరఫరాల మంత్రిత్వ శాఖామంత్రి కొడాలి నాని సొంత నియోజకవర్గమైన గుడివాడలో గోవా క్యాసినో కల్చర్.. నృత్యాలు సంబంధించిన విష‌యాలు వివాద‌స్ప‌ద‌మ‌వుతున్నాయి. గుడివాడ క్యాసినో గాంబ్లింగ్‌, అక్క‌డి నృత్యాల‌పై టీడీపీ బృందం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. 
 

TDP team complains to SP over Gudivada dances
Author
Hyderabad, First Published Jan 18, 2022, 2:24 AM IST

ANDHRA PRADESH: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు అంరంగం వైభవంగా జరిగాయి. అయితే, పేకాట, కోడిపందాలు, క్యాసినో గ్యాంబ్లింగ్ వంటి పందాల్లో మూడు రోజుల్లో కోట్లాది రూపాయల మేరకు చేతులు మారాయి. ముఖ్యంగా, రాష్ట్ర పౌరసరఫరాల మంత్రిత్వ శాఖామంత్రి కొడాలి నాని సొంత నియోజకవర్గమైన గుడివాడలో గోవా క్యాసినో కల్చర్.. నృత్యాలు సంబంధించిన విష‌యాలు వివాద‌స్ప‌ద‌మ‌వుతున్నాయి. గుడివాడ క్యాసినో గాంబ్లింగ్‌, అక్క‌డి నృత్యాల‌పై టీడీపీ బృందం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌ పార్టీ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు పేరుతో గ్యాంబ్లింగ్‌ అసభ్యకర నృత్యాలు జరిగాయని టీడీపీ నేత‌ల బృందం ఆరోపించింది. 

గుడివాడ కే కన్వెన్షన్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గ్యాంబ్లింగ్‌, క్యాసినో నిర్వహించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అరికట్టాల్సిన పోలీసులు వాటిని నివారించలేకపోయారని పేర్కొన్నారు. కనుమ పండుగ రోజు గుడివాడలోని మంత్రి కొడాలి నానికి చెందిన ఎ-కన్వెన్షన్‌ లో విచ్చలవిడిగా బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌, చట్టవిరుద్దమైన కార్యక్రమాలు నిర్వహించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సుమారు 500 కోట్ల రూపాయలు మేరా డబ్బులు క్యాసినో ద్వారా చేతులు మారాయని వారు ఆరోపించారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా తెలుగువారి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. సంఘ విద్రోహక శక్తులు కూడా పెద్ద ఎత్తున చొరపడ్డారని లేఖ ద్వారా తెలిపారు.

గుడివాడలో క్యాసినో గ్యాంబ్లింగ్‌.. నృత్యాల పై ఎస్పీకి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన తెలుగుదేశం పార్టీ నేత‌ల్లో వర్ల రామయ్య, మాజీ ఎంపీ కొనకల్ల నారాయణ, ఎమ్మెల్యే గద్దే రామోహన్‌, ఎమ్మెల్సీ బొచ్చల అర్జునుడు, మాజీ ఎమ్మెల్యేలు బోండా ఉమా, రావి వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర త‌దిత‌రులు ఉన్నారు. ఈ చ‌ర్య‌ల‌కు పాల్పడిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అన్నారు. అధికార పార్టీ నేతల హ‌స్తంతోనే ఈ చ‌ర్య‌లు కొన‌సాగాయ‌ని ఆరోపించారు. 

అంత‌కు ముందు మీడియాతో మాట్లాడిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు.. అధికార వైకాపా పార్టీ స‌ర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శ‌లు గుప్పించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో కేసినో కల్చర్, పేకాట క్లబ్బులు పెరిగాయని Chandrababu Naidu విమర్శించారు. గుడివాడలో క్యాసినో నిర్వహించిన మంత్రిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్ర‌బాబు డిమాండ్ చేశారు. వైకాపా పాల‌న‌లో డ్రగ్స్, గంజాయి, అశ్లీల నృత్యాల్లో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందంటూ విమ‌ర్శించారు. 

అలాగే, సంక్రాంతి సెల‌వులు ముగియ‌డంతో పాఠ‌శాల‌లు తెర‌వ‌డానికి సిద్ధమైంది ఏపీ ప్ర‌భుత్వం. దీనిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్ర‌బాబు నాయుడు(Chandrababu Naidu) .. క‌రోనా ప‌రిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని విద్యాసంస్థ‌ల‌కు వెంట‌నే సెల‌వులు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. పార్టీ వ్యూహ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన కరోనా వల్ల 12 రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవులు ఇచ్చారని (Chandrababu Naidu) గుర్తు చేశారు. 

పాఠ‌శాల‌లు తిరిగి తెర‌వ‌డంపై ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యాశాఖ‌ మంత్రి ఆదిమూలపు సురేష్ (Minster Adimulapu Suresh) స్పందిస్తూ.. కరోనా వ్యాప్తికి, స్కూళ్లు తెరవటానికి ఏమాత్రం సంబంధం లేదని అన్నారు. కావాల‌నే విప‌క్షాలు రాద్ధాంతం చేస్తున్నాయ‌ని ఆరోపించారు. విద్యార్థులు నష్టపోకూడదనే స్కూళ్లు తెరిచామని మంత్రి స్పష్టం చేశారు. ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కరోనా మ‌హ‌మ్మారి కేసులు ఎక్కువగా నమోదవుతున్నప్పటికీ పరిస్థితి అదుపులోనే ఉందని (Minster Adimulapu Suresh) అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios