విజయవాడ: ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీమంత్రి కిమిడి కళా వెంకట్రావు. రాష్ట్రంలో విద్యుత్ కోతలకు జగన్ వైఖరే కారణమని ఆరోపించారు. జగన్ స్వార్ధం వల్లే రాష్ట్రం అంధకారమైందని మండిపడ్డారు. 

సాగర్‌, శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ఉన్నా కోతలు విధిస్తున్నారని ఆరోపించారు. రూ.4లోపే పవన, సౌర విద్యుత్ దొరికే అవకాశం ఉన్నా కమీషన్ల కోసం సమీక్షల పేరుతో కాలయాపన చేస్తున్నారంటూ దుయ్యబుట్టారు. 

సొంత పవర్ ప్లాంట్ ద్వారా కర్ణాటకకు విద్యుత్ అమ్ముతున్న సీఎం జగన్ రాష్ట్రంపై ఎందుకు దృష్టి సారించడం లేదో చెప్పాలని నిలదీశారు. పీపీఏల విషయంలో తమపై బురదచల్లే ప్రక్రియ తప్ప విద్యుత్ వ్యవస్థను చక్కదిద్దే ప్రయత్నం జగన్ ఏనాడూ చేయడం లేదని మండిపడ్డారు. ప్రజలకు సమాధానం చెప్పలేకనే సీఎం ఇంటి చుట్టూ 144సెక్షన్ పెట్టుకున్నారంటూ మాజీమంత్రి కళా వెంకట్రావు ఎదురుదాడికి దిగారు.