ఆంధ్రప్రదేశ్‌లో అధికారమే లక్ష్యంగా టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే అధికార వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు కార్యాక్రమాలతో ప్రజల్లోకి వెళ్తుంది.
ఆంధ్రప్రదేశ్‌లో అధికారమే లక్ష్యంగా టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే అధికార వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు కార్యాక్రమాలతో ప్రజల్లోకి వెళ్తుంది. తాజాగా టీడీపీ మరో కొత్త ప్రచారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నాలుగేళ్ల నరకం పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. 'ఇది రాష్ట్రమా..? రావణ కాష్టమా..?' అని ప్రశ్నించారు. ఆ వీడియోలో రాష్ట్రంలో నేరాలు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని.. సీఎం జగన్ మౌనం వహిస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసనలు చేపడతారని టీడీపీ వర్గాలు తెలిపాయి. వైసీపీ నాలుగేళ్ల పానలలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలియజేసేలా కార్యక్రమాలు చేపట్టనున్నట్టుగా పేర్కొన్నాయి. నాలుగేళ్ల నరకం నిరసనల ద్వారా రంగాల వారీగా జరిగిన అన్యాయాన్ని చెబుతూ నలభైఏళ్లు రాష్ట్రాన్ని వెనక్కి ఎలా నెట్టారో చూపిస్తూ.. ప్రజల వద్దకు నేతలు వెళ్లనున్నట్టుగా తెలిపాయి.
