అమరావతి: ఆంధ్రప్రదేశ్ హోంశాఖమంత్రి మేకతోటి సుచరితపై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి. ప్రతీచోటా  కాపలా ఉండలేమని హోం మంత్రి వ్యాఖ్యానించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

శాంతి భద్రతలు కాపాడాల్సిన హోంమంత్రి ప్రతీచోటా కాపలా ఉండలేమని అనడం సరికాదంటూ హితవు పలికారు. హోంమంత్రే అలా అంటే ప్రజలు ఏమైపోవాలని నిలదీశారు.  సుచరిత వ్యాఖ్యలు విన్న తర్వాత మహిళ హోంమంత్రి అయ్యారన్న సంతోషం నెల రోజుల్లోనే ఆవిరైందని వ్యాఖ్యానించారు. 

మరోవైపు టీడీపీ  అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు భద్రత తగ్గించిన విషయం వాస్తవం కాదా? అని హోంమంత్రిని ప్రశ్నించారు. అధికారుల బదిలీలపై ఉన్న శ్రద్ధ ప్రజల భద్రతపై కూడా ఉండాలని వైయస్ జగన్ సర్కార్ కు దివ్యవాణి సెటైర్లు వేశారు.