విజయవాడ: వైయస్ జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ. వైసీపీ ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం అంటూ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో విత్తనాల సంక్షోభానికి మాజీ సీఎం చంద్రబాబు నాయుడే కారణమని వైసీపీ నేతలు మాటల దాడి చేయడం దురదృష్టకరమంటూ వ్యాఖ్యానించారు. 

విత్తనాలు సరఫరా చేయడం చేతాకక వైసీపీ నిందలు చంద్రబాబుపై మోపుతోందని మండిపడ్డారు. వైసీపీ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబును విమర్శిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

చంద్రబాబుపై కక్ష సాధింపు పనిలో పడి విత్తనాల పంపిణీని, సంక్షేమాన్ని గాలికొదిలేస్తారా? అని నిలదీశారు. అన్నింటికి చంద్రబాబుపై పడి ఏడవడం వైసీపీ నేతల దురలవాటని అనురాధ విమర్శించారు.