ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంపై విరుచుకుపడ్డారు టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈసీ కార్యాలయం సీఎస్‌కు బ్రాంచ్ ఆఫీస్‌లా మారిందని ఆరోపించారు.

ఓట్ల లెక్కింపు ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తుందని ... దానిలో సీఎస్‌కు సంబంధం ఏంటని నరేంద్ర ప్రశ్నించారు. సీఈవో ద్వివేది తన అధికారాలను సీఎస్ వద్ద తాకట్టు పెట్టారని ఆరోపించారు.

తన రాజకీయ జీవితంలో ఇంత అహంకార సీఎస్‌ని ఎక్కడా చూడలేదన్నారు. ఎన్నికల కోడ్ ఏపీలోనే ఉందా..? దేశంలో ఎక్కడా లేదా..? అని నరేంద్ర అనుమానం వ్యక్తం చేశారు. జగన్ సీఎం అవుతారని ఆ పార్టీ నేతలు పగటి కలలు కంటున్నారని ధూళిపాళ్ల వ్యాఖ్యానించారు.