అఖిలపక్ష సమావేశంలో చంద్రబాబు అరెస్టు ప్రస్తావన..
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును సిఐడి అధికారులు అరెస్టు చేయడం రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో చంద్రబాబు నాయుడు అరెస్టు అంశం ప్రస్తావనకు వచ్చింది.

స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ను సిఐడి అధికారులు అరెస్టు చేయడం రాజకీయంగా తీవ్ర ఆందోళనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ.. తెలుగు రాష్ట్రాలలో ఆందోళనలు చేస్తున్న విషయం కూడా తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. ఈ అఖిల పక్ష సమావేశంలో చంద్రబాబు నాయుడు అరెస్టు అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ అంశాన్ని టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు అఖిలపక్ష సమావేశంలో లేవనెత్తారు.
అఖిలపక్ష సమావేశం అనంతరం టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును సమావేశంలో లేవనెత్తినట్లు తెలిపారు. అలాగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కూడా చంద్రబాబు అరెస్టు విషయాన్ని ప్రస్తావిస్తానని తెలిపారు.
మరోవైపు.. అఖిలపక్ష సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రస్తావన కూడా వచ్చినట్లు తెలుస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలో ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ నేత రంజాన్ చౌదరి డిమాండ్ చేశారు. అలాగే బిజెపి మిత్రపక్షమైన ఎన్సిపి రెబల్ వర్గం కూడా మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని కోరింది. ఈ వర్గానికి చెందిన నేత ప్రపుల్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ ..కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ స్పెషల్ సెషన్స్ లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని కోరారు. ఈ బిల్లు ప్రవేశపెడితే ఏకగ్రీవంగా ఆమోదం పొందుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు..
వినాయక చతుర్థి సందర్భంగా పార్లమెంటు నూతన భవనంలో తొలి సమావేశం జరగనుంది. ఈ శుభ సందర్భం వేళ .. మహిళ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి నూతన శకానికి ప్రారంభం పలకాలని బి జె డి ఎంపీ పినాకి మిశ్రా కోరారు.. మరోవైపు కేంద్ర పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. ఇటీవల కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన భద్రత సిబ్బందికి అఖిలపక్ష సమావేశంలో నివాళులు అర్పించామని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.