కొండల్లో, గుట్టల్లో సెంట్ స్థలం ఇచ్చిచేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. నివాస యోగ్యతలేని స్థలంలో పునాదుల కోసం లక్ష రూపాయలు కట్టమని చెబుతున్నారన్నారు.

పేదలందరికీ ప్రభుత్వమే ఇళ్లు నిర్మించాలంటూ టీడీపీ నేతలు ధర్నా చేపట్టారు. విజయవాడలో చేపట్టిన ఈ ధర్నాలో.. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో పేదలందరికీ ఉచితంగా ఇళ్లు ఇస్తామన్నారని గుర్తు చేశారు.

అధికారంలోకి వచ్చి 28 నెలలు అవుతున్నా.. ఆ ఊసే ఎత్తడం లేదని ఆయన అన్నారు. కొండల్లో, గుట్టల్లో సెంట్ స్థలం ఇచ్చిచేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. నివాస యోగ్యతలేని స్థలంలో పునాదుల కోసం లక్ష రూపాయలు కట్టమని చెబుతున్నారన్నారు.

పేదలు ఏవిధంగా అంత డబ్బులు తేవాలో పాలకులే చెప్పాలన్నారు. ముప్పై లక్షల ఇళ్లు ఇస్తామని చెప్పి.. పేదలను మోసం చేస్తున్నారన్నారు. డబ్బులేదన్న వారిస్థలాలు రద్దు చేస్తామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు.

వాలంటీర్లతో పేదలపై ఒత్తిడి చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో మొదలుపెట్టిన ఇళ్లను కూడా ఇంకా పూర్తి చేయలేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.