విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. 

చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ లేఖ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జగన్ కు అభినందనలు అంటూ లేఖలో తెలిపారు. శాసన సభలో ఏపీ ప్రతిపక్ష పార్టీగా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. 

ఇకపోతే తన ప్రమాణ స్వీకారానికి హాజరుకావాల్సిందిగా వైయస్ జగన్ స్వయంగా చంద్రబాబు నాయుడును ఆహ్వానించారు. అయితే టీడీఎల్పీ భేటీలో జగన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో చంద్రబాబు లేఖ ద్వారా అభినందనలు తెలిపారు.