బద్వేల్: కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో  టీడీపీలో రెండు వర్గాలు ఒక్కటయ్యాయి. మాజీ ఎమ్మెల్యే  విజయమ్మ, సిట్టింగ్ ఎమ్మెల్యే జయరాములు కలిసిపోయారు.  బద్వేల్ నియోజకవర్గంలో  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పర్యటనను పురస్కరించుకొని కడప జిల్లా ఇంచార్జీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఇరు వర్గాల మధ్య సయోధ్యను కుదిర్చారు.

కడప జిల్లా బద్వేల్ సిట్టింగ్ ఎమ్మెల్యే  జయరాములు  వైసీపీ నుండి టీడీపీలో చేరారు. అయితే  ఈ రెండు గ్రూపుల మధ్య కొంతకాలంగా పొసగడం లేదు.  అయితే  పార్టీని నడిపించేందుకుగాను జిల్లా ఇంచార్జీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నడుంబిగించారు. 

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  బద్వేల్ నియోజకవర్గంలో  పర్యటన ఉంది. దీంతో  పార్టీలో గ్రూపులను  సమన్వయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ విషయమై  మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి   మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, సిట్టింగ్ ఎమ్మెల్యే జయరాములుతో చర్చించారు. 

బద్వేల్ మాజీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి బిజివేముల వీరారెడ్డి కూతురు విజయమ్మ.  వీరారెడ్డి మృతి తర్వాత ఆయన కూతురు విజయమ్మ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004 ఎన్నికల్లో  ఆమె పోటీ చేసీ ఓటమి పాలయ్యారు. అప్పటి నుండి ఆమె బద్వేల్ నియోజకవర్గానికి టీడీపీ ఇంచార్జీగా కొనసాగుతోంది. 2009లో ఈ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ చేశారు.

దీంతో విజయమ్మ సూచించినవారికే  టీడీపీ టిక్కెట్టును కేటాయిస్తున్నారు. 2009లో  కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన  కమలమ్మ విజయం సాధించారు. 2014లో టీడీపీ అభ్యర్ధిగా విజయజ్యోతి పోటీ చేసింది. అయితే వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన జయరాములు చేతిలో  విజయజ్యోతి ఓటమిపాలైంది.

అయితే ఏపీలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు వైసీపీ నుండి టీడీపీలో చేరారు. అయితే టీడీపీ ఇంచార్జీ  విజయమ్మకు జయరాములుకు మధ్య చాలా కాలంగా పొసగడం లేదు. దీంతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి  వీరిని సమన్వయం చేసే బాధ్యతను తీసుకొన్నారు.

మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి  నేతృత్వంలో  టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి సహా ఇతర ముఖ్య నేతలు  ఎమ్మెల్యే జయరాములును తీసుకొని టీడీపీ బద్వేల్ ఇంచార్జీ  విజయమ్మ  ఇంటికి తీసుకెళ్లారు. ఇద్దరి మధ్య రాజీని కుదిర్చారు. పార్టీ అధిష్టానం ఏం చెబితే  దాన్ని పాటిస్తామని ఇంచార్జీ విజయమ్మ, ఎమ్మెల్యే జయరాములు ప్రకటించారు.

ఈ వార్తలు  చదవండి

టీడీపీ పక్కా ప్లాన్: విజయానికి అసలు ప్రయోగశాల ఇదే..