అమరావతి: ఈ నెల 30వ తేదీ నుండి జరగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టీడీపీ కసరత్తు చేస్తోంది. ఈ సమావేశాలలోపుగానే మరికొన్ని సంక్షేమ పథకాలను కూడ ప్రకటించేందుకు బాబు ప్లాన్ చేస్తున్నారు. ఏపీ అసెంబ్లీకి ఇవే చివరి సమావేశాలుగా భావిస్తున్నారు. ఈ తరుణంలోనే విపక్షాలతో పాటు కేంద్రం తీరును ఎండగట్టేలా టీడీపీ రంగం సిద్దం చేసుకొంటుంది.

ఈ నెల 30వ తేదీ నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో చంద్రబాబునాయుడు సర్కార్ ఉంది. ఈ సమావేశాలు ప్రారంభమయ్యే లోపుగానే కొన్ని  కీలకమైన ప్రకటనలు చేసే దిశగా ఏపీ సర్కార్  ప్లాన్‌ చేస్తోంది. గత ఎన్నికల సమయంలో  ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగా చంద్రబాబునాయుడు రైతులకు రుణమాఫీని  అమలు చేస్తున్నారు.

ఇప్పటికే మూడు విడతలుగా రుణమాఫీ కింద బకాయిలను విడుదల చేశారు. ఇంకా రెండు విడడతల బకాయిలను చెల్లించాల్సి ఉంది. ఈ  రెండు విడతల బకాయిలను కూడ విడుదల చేసే అవకాశం ఉంది.  ఈ రెండు విడతలకు సంబంధించి సుమారు రూ. 8 నుండి 9 వేల కోట్లు అవుతోందని  అంచనా. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నాటికి ఈ రెండు విడతల బకాయిలను విడుదల చేయాలని సర్కార్ తలపెట్టింది.

మరో వైపు పెన్షన్‌ను వెయ్యి రూపాయాల నుండి రెండువేలకు పెంచాలని కూడ బాబు సర్కార్ నిర్ణయం తీసుకొంది. ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుండి పెంచిన పెన్షన్ ను అమలు చేయాలని  సర్కార్  ప్లాన్‌ చేస్తోంది.ఇప్పటికే సంబంధిత  శాఖకు ఈ మేరకు ఆదేశాలు కూడ వెళ్లాయి.

మరికొన్ని విధానపరమైన నిర్ణయాలు కూడ ఈ అసెంబ్లీ సమావేశాల్లోపుగానే ఉంటాయని  టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.  మరో వైపు ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వంటి పరిణామలను  దృష్టిలో ఉంచుకొని అసెంబ్లీ వేదికగా చంద్రబాబునాయుడు కేంద్రం తీరును మరోసారి ఎండగట్టే అవకాశం లేకపోలేదు.

దీనికి తోడు కేంద్రంపై