చిత్తూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే డీఏ సత్యప్రభ(70) మరణించారు. గత నెలలో కరోనా బారినపడ్డ ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందారు. 

ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ, రెండు సార్లు టిటిడి ఛైర్మన్ గా రెండుసార్లు పనిచేసిన దివంగత ఆదేకేశవులు భార్యే సత్యప్రభ.  2009లో ఆదికేశవులు అనారోగ్యంతో మృతిచెందాక ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. 2014 లో టిడిపి తరపున పోటీచేసి చిత్తూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం ఆమె తెలుగుదేశం జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. 

అయితే ఇటీవల కరోనాబారిన పడ్డ ఆమె బెంగళూరులోని వైదేహీ హాస్పిటల్ చేరి చికిత్స పొందారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఈ నెల 3వ తేదీ నుండి మరింత క్షీణించడంతో ఐసియూలో వెంటిలేటర్ పై వుంచారు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి ఆమె కన్నూమూశారు.