Asianet News TeluguAsianet News Telugu

అందుకే వారి సంతానానికి మాత్రమే చంద్రబాబు కారణం కాదనేది: లోకేష్ సంచలనం

పులిచింతల ప్రాజెక్ట్ గేట్ ఊడిపోవడానికీ గతంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలే కారణమంటూ అధికార వైసిపి ప్రచారం చేయడంపై స్పందిస్తూ టిడిపి నాయకులు లోకేష్ ఘాటు విమర్శలు చేశారు. 

tdp nara lokesh sensational comments on ycp leaders  akp
Author
Mangalagiri, First Published Aug 6, 2021, 2:00 PM IST

అమరావతి: పులిచింతల ప్రాజెక్ట్ గేట్ ఊడిపోవడానికీ గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ నిర్వాకమే కారణమంటూ వైసిపి అనుకూల మీడియా ప్రచారం చేస్తోందంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఈ ప్రచారంపై లోకేష్ ఘాటుగా స్పందించారు. 
 
 పులిచింతల ప్రాజెక్ట్ విషయంలో వైసిపి నాయకులు చేస్తున్న ప్రచారంపై స్పందిస్తూ లోకేష్ సోషల్ మీడియా వేదికన సంచలన వ్యాఖ్యలు చేశారు.   ''ఇందుకే అన్నది వారి సంతానానికి, అక్రమ సంపాదనకి తప్ప మిగిలిన అన్నింటికీ చంద్రబాబు గారే కారణమంటారని'' అంటూ ఘాటు వ్యాఖ్యలతో ట్వీట్ చేశారు.

''జలయజ్ఞం పేరుతో మహా''మేత''... దరిద్ర పాదం ఎఫెక్ట్ తో ఊడిపడిన గేటు... సముద్రంపాలవుతున్న లక్షల క్యూసెక్కుల జలాలు... తండ్రి హయాంలో జరిగిన అవినీతి తనయుడి హయాంలో బయటపడటమే దేవుడి స్క్రిప్ట్'' అని లోకేష్ ఎద్దేవా చేశారు. 

read more  పులిచింతల ప్రాజెక్టు విరిగిన 16వ గేటు: జగన్ సర్కార్ ఆగ్రహం, విచారణకు ఆదేశం

పులిచింతల ప్రాజెక్టు గేటు ఊడిపోవడంపై వైసిపి సర్కార్‌ నిపుణుల కమిటీతో విచారించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి నీటి వృధాను నిలువరించడానికి తాత్కాలికంగా స్టాప్‌ లాగ్‌ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ప్రాజెక్టు భద్రతకు చర్యలు చేపట్టాలని... బాధ్యులపై కఠిన చర్యలు తీసువాలని చూస్తోందని వైసిపి అనుకూల మీడియా ఓ వార్తను  ప్రచురించింది. 

''2003లో పులిచింతల కాంట్రాక్టును టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకు అప్పటి చంద్రబాబు సర్కార్ ఇచ్చింది. ఈ క్రమంలోనే 2015లో ప్రాజెక్టు పనులు నాసిరకమని ఎస్‌డీఎస్‌ఐటీ తేల్చింది. అయినా ఆనాటి టిడిపి ప్రభుత్వం పట్టించుకోలేదు. అలాగే  గ్రౌటింగ్‌ చేసేందుకు 24 బోర్లు తవ్వి వదలేయడం వల్ల స్పిల్‌ వేలో భారీ ఎత్తున లీకేజీలు ఏర్పడ్డాయి. దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ఇచ్చిన నివేదికను బుట్టదాఖలు చేసింది.  ఫలితంగానే 16వ గేటు ఊడి పోయింది'' అంటూ పులిచింతల వ్యవహారాన్ని గత టిడిపి ప్రభుత్వంపై నెట్టేలా జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ లోకేష్ పైవిధంగా సంచలన కామెంట్స్ చేశారు. 

ఇదిలావుంటే ఊడిపోయిన పులిచింతల ప్రాజెక్టుకు 16వ గేటు స్థానంలో స్టాఫ్ లాక్‌ ఏర్పాటు చేసేందుకు ఇరిగేషన్ అధికారులు యుద్దప్రాతిపదికన చర్యలు ప్రారంభించారు. ప్రాజెక్టులో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గితేనే స్టాఫ్ లాక్ ను బిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఇక ఇప్పటికే స్టాప్ గేటు బిగించేందుకు నిపుణులు ప్రాజెక్టు వద్దకు చేరుకొన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios