Asianet News TeluguAsianet News Telugu

కేంద్రమంత్రి బీరేంద్రసింగ్ తో టీడీపీ ఎంపీల భేటీ

ప్రధానంగా ఐదు డిమాండ్లను ఎంపీలు.. కేంద్రమంత్రి ముందుకు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. అంతకుముందు ఎంపీ సుజనాచౌదరి నివాసంలో భేటీ అయిన ఎంపీలు పలు అంశాలపై చర్చించారు.

tdp mps meeting with central minister beerendra singh
Author
Hyderabad, First Published Oct 13, 2018, 12:01 PM IST

కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం తాము పోరాటం కొనసాగిస్తామని టీడీపీ ఎంపీలు పేర్కొన్నారు. ఈ పోరాటంలో భాగంగానే శనివారం ఉదయం కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ తో టీడీపీ ఎంపీలు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. ప్రధానంగా ఐదు డిమాండ్లను ఎంపీలు.. కేంద్రమంత్రి ముందుకు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. అంతకుముందు ఎంపీ సుజనాచౌదరి నివాసంలో భేటీ అయిన ఎంపీలు పలు అంశాలపై చర్చించారు.
 
టీడీపీ ఎంపీలు లేఖలో పేర్కొన్న డిమాండ్లు ఇవే:
కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్రం ఏదో ఒకటి తేల్చాలి.
కేంద్రం ఏర్పాటు చేయకపోతే ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఏపీకి అవకాశం కల్పించాలి.
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా ఏర్పాటుకు కృషి చేయాలి.
కేంద్రం, రాష్ట్రం, ప్రైవేట్ భాగస్వామ్యానికి అంగీకారమా?
కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం ప్రైవేట్ సెక్టార్‌ను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇస్తారా? అంటూ ఎంపీలు లేఖలో పేర్కొన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios